ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhuvaneshwari: మరికొద్ది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది..

ABN, Publish Date - Feb 29 , 2024 | 05:16 PM

Andhrapradesh: మరికొద్దిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. గురువారం జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తల ఇంటికి వచ్చి ఓదార్చారు. అనంతరం భువనమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని... టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు.

అనకాపల్లి, ఫిబ్రవరి 29: మరికొద్దిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. గురువారం జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తలను ఓదార్చారు. అనంతరం భువనమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని... టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు మంచిపేరు ఉండేదన్నారు. కానీ ఆంధ్ర పేరు చెబితే గంజాయి, కల్తీ మద్యం, ఇసుక మాఫియా గుర్తుకొస్తున్నాయన్నారు. మన దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని భువనేశ్వరి కోరారు.

కాగా... చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెంది మృతిచెందిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలావాలి’’ పేరుతో ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఓదారుస్తున్నారు. వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. టీడీపీ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇస్తున్నారు.

AP News: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్

Perni Nani: పవన్ నువ్వు నికార్సైన వాడివైతే...


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 29 , 2024 | 05:16 PM

Advertising
Advertising