ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఆ వార్తలు సాక్షిలో ఎలా వచ్చాయి.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్

ABN, Publish Date - Apr 18 , 2024 | 04:20 PM

మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ (CM Jagan) గులకరాయి డ్రామా ఆడారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఆయన చేసిన నాటకమే ఈ బూటకపు హత్యా ప్రయత్నమని.. ‘‘జగన్నాటకం’’.. ఇదో పెద్ద డ్రామా అని ఆరోపించారు. గతంలో కోడికత్తి, మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు.. అదే కుట్రతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Varla Ramaiah

అమరావతి: మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ (CM Jagan) గులకరాయి డ్రామా ఆడారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఆయన చేసిన నాటకమే ఈ బూటకపు హత్యా ప్రయత్నమని.. ‘‘జగన్నాటకం’’.. ఇదో పెద్ద డ్రామా అని ఆరోపించారు.

గతంలో కోడికత్తి, మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు.. అదే కుట్రతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గులకరాయి లేదు, హత్యా ప్రయత్నమే లేదన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలీసు కమిషనర్, సాక్షి పత్రిక ఒకటేనా? అనే అనుమానం కలుగుతోందన్నారు.


AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

పోలీసుల దర్యాప్తు అంతా సాక్షి పత్రికలోనే ఎలా వస్తోందని ప్రశ్నించారు. టీడీపీ నేత బోండా ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసురావు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. సాక్షి తప్పుడు కథనాలు అల్లుతుంటే దానికి పోలీసు అధికారులు జీ హుజూర్ అనటం సబబా? అని నిలదీశారు. గులకరాయి దొంగ నాటకం ప్రజలకు తెలిసిపోవడంతో వైసీపీ నాయకులు మౌనం వహించారన్నారు.

ప్రజాశక్తి, విశాలాంధ్ర, హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలకు అందని సమాచారం ఒక్క సాక్షికే ఎలా చేరుతోంది? అని ప్రశ్నించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఈరోజు అరెస్టు చేస్తున్నట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాలేదు, మరి సాక్షిలోనే ఎలా వచ్చింది? అని నిలదీశారు. పోలీసులు, సాక్షి పత్రిక కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.


Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా

ఓ అమాయకుడిని అక్రమంగా అరెస్టు చేసే ముందు తన ప్రశ్నలకు విజయవాడ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌కి రాయి విసిరిన ఘటన జరిగి నేటికి 6 రోజులు అవుతోంది, ఇంతవరకు ఆ రాయి పోలీసులకు ఎందుకు చిక్కలేదు? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిపై ఎందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు? అని నిలదీశారు.

సీఈఓ ముకేష్ కుమార్ మీనా ఏం రిపోర్టు పంపారో ఇన్వెస్టిగేషన్ అధికారులు బహిర్గతం చేయాలన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాయి విసిరిన ఘటనలో..ఆ రాయిసెక్యురిటీ ఆఫీసర్‌కు తగిలితే హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు? అని ప్రశ్నించారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనలో ఎన్‌ఎస్‌జీ తలపగిలితే హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.


Bosta: పదివేల కోట్లతో విశాఖ మరింత అభివృద్ధి.. అదే అమరావతికి పెడితే ఏం వస్తుంది?

జగన్ సభలో చిన్న గులకరాయి వచ్చి తగిలితే అది హత్యాయత్నమా? ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. అనవసరంగా అమాయకులైన వడ్డెర కుర్రాళ్లని బలిచేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. అధికారం ఎవరికీ సొంతం కాదని.. పోలీసులు తప్పటడుగులు వేయొద్దని సూచించారు.

గులకరాయి ఘటనలో ఫెయిల్యూర్ అయిన సెక్యురిటీ సిబ్బందిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, వారిపై ఏం యాక్షన్ తీసుకున్నారు? అని ప్రశ్నించారు. పోలీసులు తొందరపడి జగన్ మెప్పు కోసం తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదని, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వర్ల రామయ్య హెచ్చరించారు.


AP Elections: పెరుగుతున్న కూటమి గ్రాఫ్.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పదా..?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 04:48 PM

Advertising
Advertising