ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024:పెద్దిరెడ్డి రెండు సార్లు నా కాళ్లు పట్టుకున్నారు.. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హాట్ కామెంట్స్

ABN, Publish Date - Apr 18 , 2024 | 08:23 PM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఓ విషయంలో రెండుసార్లు తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Kiran Kumar Reddy

తిరుపతి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఓ విషయంలో రెండుసార్లు తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... పెద్దిరెడ్డికి దమ్ముంటే తన వ్యాఖ్యలపై కాణిపాకం లేదా తరిగొండలో ప్రమాణానికి సిద్ధమా..? అని సవాల్ విసిరారు. పదవుల కోసం నల్లారి కుటుంబం ఎవరి కాళ్లు పట్టుకోదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, దొమ్మీలు, దోపిడీలు చేయడం పెద్దిరెడ్డి నైజమని విరుచుకుపడ్డారు.


YS Sharmila: సాక్షిలో వైఎస్సార్‌ ఫొటోను అందుకే తీసేశారు.. షర్మిల సంచలన ఆరోపణలు

గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పద్మావతి గెస్ట్ హౌస్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు సార్లు తన కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో తన నియోజకవర్గ కార్యకర్తలు 50 మంది ఉన్నారని తెలిపారు. తాను మంత్రి పదవిని మాత్రమే ఆశించానని.. కానీ ప్రభుత్వ విప్ అయ్యానని చెప్పా రు. అటు తర్వాత శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి అయ్యాను.. ఇలా అనుకోకుండా అన్ని పదవులు పొందానని వివరించారు.


పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా..? అని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక, మద్యం , మైన్స్, భూముల్లో వేల కోట్లు దోచేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదమెక్కి పెద్దిరెడ్డి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.


Bosta: పదివేల కోట్లతో విశాఖ మరింత అభివృద్ధి.. అదే అమరావతికి పెడితే ఏం వస్తుంది?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 08:42 PM

Advertising
Advertising