Share News

YS Sharmila: సాక్షిలో వైఎస్సార్‌ ఫొటోను అందుకే తీసేశారు.. షర్మిల సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 08:14 PM

ప్రత్యేక హోదాను సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) కనుమరుగు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. గురువారం నాడు శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఒక చేత్తో పథకాలు ఇచ్చి ..మరో చేతితో జగన్ గుంజుకుంటున్నారని విమర్శించారు.

YS Sharmila: సాక్షిలో వైఎస్సార్‌ ఫొటోను అందుకే తీసేశారు.. షర్మిల సంచలన ఆరోపణలు
YS Sharmila

అనంతపురం: ప్రత్యేక హోదాను సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) కనుమరుగు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. గురువారం నాడు శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఒక చేత్తో పథకాలు ఇచ్చి ..మరో చేతితో జగన్ గుంజుకుంటున్నారని విమర్శించారు. ఇదే శింగనమల నియోజకవర్గానికి జగన్ ఎన్నో హామీలు ఇచ్చి మరిచారని మండిపడ్డారు. హార్టికల్చర్‌కి పెద్ద పీట వేస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు.


Bosta: పదివేల కోట్లతో విశాఖ మరింత అభివృద్ధి.. అదే అమరావతికి పెడితే ఏం వస్తుంది?

పంట స్థిరీకరణ నిధి, పరిశ్రమలు ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామానికి సాగునీరు, లెదర్ పార్క్‌ను తెరిపిస్తానని మోసం చేశారని మండిపడ్డారు. ఏ ఒక్క హామీని జగన్ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని ఈ వైసీపీ ప్రభుత్వం అవసరమా ? అని నిలదీశారు. మళ్లీ మోసం చేయడానికి వీళ్లకు అధికారం ఇవ్వాలా ? అని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఏవి అమలు కాలేదన్నారు.


AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

మద్యపాన నిషేధం అని అమలు చేశారా ? అని ప్రశ్నించారు. నిషేధం పక్కన పెడితే.. ప్రభుత్వ భూములు కూడా అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి.. మరో చేతితో వెండి చెంబు గుంజుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది వైఎస్సార్ పాలన కాదన్నారు. వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరని ధ్వజమెత్తారు. Y - అంటే వైవీ సుబ్బారెడ్డి , S -అంటే సాయి రెడ్డి, R -అంటే రామకృష్ణ అని సెటైర్లు గుప్పించారు. సాక్షి టీవీలో సైతం వైఎస్సార్ ఫొటోను మాయం చేశారని విరుచుకుపడ్డారు.


AP Elections: పెరుగుతున్న కూటమి గ్రాఫ్.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పదా..?

పథకాల్లో వైఎస్సార్ ఫొటో తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. పోలవరం కట్టి ఉంటే ఏపీ సస్యశ్యామలం అయ్యి ఉండేదని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు.


Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 08:30 PM