ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP Minority Morcha Sheikh Baji: రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

ABN, Publish Date - Apr 09 , 2024 | 04:40 PM

ఏపీలో ముస్లింలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మైనారిటీ మోర్చా ఏపీ ప్రెసిడెంట్ షేక్ బాజీ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లను (రద్దు)చేస్తారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

ఢిల్లీ: ఏపీలో ముస్లింలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మైనారిటీ మోర్చా (BJP Minority Morcha) ఏపీ ప్రెసిడెంట్ షేక్ బాజీ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లను (రద్దు)చేస్తారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్లపై నకిలీ వార్తలు సృష్టిస్తు్న్నారన్నారు. ఓ ఛానల్ లో రిజర్వేషన్ల పైన వార్తలు వచ్చినట్లు వాటికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ (Chandrababu Naidu and Pawan Kalyan) మద్దతు తెలిపినట్లు అబద్ధపు వార్తని క్రియేట్ చేశారని తెలిపారు. ఇలాంటి వార్తలపై ఎన్డీఏ కూటమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నకిలీ వార్తలు, వీడియోలపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఏపీలో విడగొట్టడం, పగలగొట్టడం, తొడకొట్టడం భయభ్రాంతులకు గురి చేయటంతోనే కాలం గడిపిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SC , ST , BCల గురించి మాట్లాడే పరిస్థితి లేదన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప.. అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగమిగా తయారు చేస్తామని షేక్ బాజీ ధీమా వ్యక్తం చేశారు.

Kanakamedala Ravindra Kumar: అందుకే మానహ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..

Raghu Rama Krishna Raju: నాకెలాంటి భయం లేదు.. పవన్‌కల్యాణ్‌ను హామీ ఇచ్చారు..

Updated Date - Apr 09 , 2024 | 04:41 PM

Advertising
Advertising