Share News

Kanakamedala Ravindra Kumar: అందుకే మానహ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..

ABN , Publish Date - Apr 09 , 2024 | 03:44 PM

కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలు నేరుగా పింఛన్‌దారుల ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. పింఛన్‌దారులు అందర్నీ ఆఫీసులకు పిలిచి.. ఎలాంటి

Kanakamedala Ravindra Kumar: అందుకే మానహ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..

ఢిల్లీ: పెన్షనర్ల శవాలను అడ్డుపెట్టుకొని.. రాజకీయం చేసి వైసీపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని, అందుకే అందుకే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ( Kanakamedala Ravindra Kumar) అన్నారు. మంగళవారం జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ (Human Rights Commission Chairman) అరుణ్ కుమార్ మిశ్రాను.. కనకమేడల రవీంద్ర కుమార్ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఏపీకి సంబంధించిన పలు సమస్యలను మానవహక్కుల కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలు నేరుగా పింఛన్‌దారుల ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. పింఛన్‌దారులు అందర్నీ ఆఫీసులకు పిలిచి.. ఎలాంటి వసతి, సదుపాయాలు లేకుండా ఇబ్బంది గురి చేశారని చెప్పారు. ఎలాంటి సదుపాయాలు చేయకపోవడంతో 33 మంది వృద్ధులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ తాము ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ ప్రయోజనాల కారణంగానే పింఛన్‌దారులు చనిపోయారన్నారు. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసమే శవ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

పెన్షనర్ల శవాలను అడ్డుపెట్టుకొని.. వైసీపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పారు. అందుకే జాతీయ మానహ హక్కుల కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఆదేశించారని తెలిపారు. వాలంటరీ వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేసి రాజకీయ అవసరాల కోసం వాడుకుందని చెప్పారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల కోసం ఉపయోగించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పింఛన్లు ఆగిపోవడానికి ప్రతిపక్షమే కారణమని కావాలని ప్రచారం చేస్తున్నారని రవీంద్ర కుమార్ అన్నారు.

Raghu Rama Krishna Raju: నాకెలాంటి భయం లేదు.. పవన్‌కల్యాణ్‌ను హామీ ఇచ్చారు..

Updated Date - Apr 09 , 2024 | 03:44 PM