ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నెటిజన్ల మనసును కట్టిపడేస్తున్న వృద్ధ జంట వీడియో.. ఈ వయసులో ఈ ప్రేమ బంధమే కదా కావాల్సిందంటూ..!

ABN, First Publish Date - 2023-05-20T16:03:19+05:30

చాలా మంది దంపతులు వివాహమైన కొత్తలో సంతోషంగానే ఉంటారు. కానీ వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నెలలు కూడా గడవకుండానే గొడవ పడుతుంటారు. చీటికీమాటికీ ఒకరిపై ఇంకొకరు నిందలు వేసుకుంటూ వాగ్వాదాలకు దిగుతుంటారు. ఈ గొడవలు చివరకు చిలికి చిలికి గాలివానలా మారి.. జీవితాలను కూడా నాశనం చేస్తుంటాయి. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా మంది దంపతులు వివాహమైన కొత్తలో సంతోషంగానే ఉంటారు. కానీ వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నెలలు కూడా గడవకుండానే గొడవ పడుతుంటారు. చీటికీమాటికీ ఒకరిపై ఇంకొకరు నిందలు వేసుకుంటూ వాగ్వాదాలకు దిగుతుంటారు. ఈ గొడవలు చివరకు చిలికి చిలికి గాలివానలా మారి.. జీవితాలను కూడా నాశనం చేస్తుంటాయి. అయితే మరికొందరు దంపతులు మాత్రం.. కష్టసుఖాలతో సంబంధం లేకుండా జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. ఇంకొందరు దంపతులు వృద్ధాప్యంలో కూడా అంతే సంతోషంతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి దంపతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధ జంట వీడియోను చూసిన నెటిజన్లు.. ఈ వయసులోనూ ఈ ప్రేమ బంధమే కదా కావాల్సింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వృద్ధ జంట వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. వివాహమైన మొదట్లో ఉన్న ప్రేమానురాగాలను వృద్ధాప్యంలోనూ ఒకరిపై ఇంకొకరు కురిపించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కుర్చీలో కూర్చుని ఉన్న వృద్ధుడి వద్దకు (elderly couple) వచ్చిన భార్య.. తన ప్రేమను వ్యక్తపరుస్తూ బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్ (Bollywood singer Lata Mangeshkar) పాడిన ‘‘జిందగీ కి నా టూటే లడి’’ పాటకు ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఇద్దరూ ఎంతో చక్కగా పాటకు లిప్ సింక్ చేస్తూ.. అద్భుతంగా నటిస్తారు.

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

ఈ పాటను నిజంగా వారే పాడారేమో అన్నట్లుగా వారి ముఖ కవలికలు ఉంటాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇలాంటి దంపతులు చాలా అరుదుగా ఉంటారు’’.. అని కొందరు, ‘‘ఇలాంటి ప్రేమ ఎంత మందికి ఉంటుంది’’.. అని మరికొందరు, ‘‘ఈ వృద్ధ జంటను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరూ ఓసారి లుక్కేయండి..

Wife: భార్య పక్కన ఉండగానే పాడు బుద్ధి.. బీచ్‌లో బికినీలో ఉన్న అమ్మాయిలను వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయిన భర్త..!

Updated Date - 2023-05-20T16:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising