Wife: భార్య పక్కన ఉండగానే పాడు బుద్ధి.. బీచ్‌లో బికినీలో ఉన్న అమ్మాయిలను వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయిన భర్త..!

ABN , First Publish Date - 2023-05-20T14:53:45+05:30 IST

అమ్మాయిలను చూస్తే చాలు.. చాలా మంది మగవాళ్లు వారిలోని శాడిజాన్ని బయటపెడుతుంటారు. ఏదో రకంగా వారిని ఇబ్బంది పట్టి పైశాసిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇంకొందరైతే భార్యను పక్కన పెట్టకుని మరీ.. పరాయి మహిళలను వక్ర దృష్టితో చూస్తుంటారు. మరికొందరు..

Wife: భార్య పక్కన ఉండగానే పాడు బుద్ధి.. బీచ్‌లో బికినీలో ఉన్న అమ్మాయిలను వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయిన భర్త..!

అమ్మాయిలను చూస్తే చాలు.. చాలా మంది మగవాళ్లు వారిలోని శాడిజాన్ని బయటపెడుతుంటారు. ఏదో రకంగా వారిని ఇబ్బంది పట్టి పైశాసిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇంకొందరైతే భార్యను పక్కన పెట్టకుని మరీ.. పరాయి మహిళలను వక్ర దృష్టితో చూస్తుంటారు. మరికొందరు వివాహేతర సబంధాలు పెట్టుకుంటూ భార్యలకు అడ్డంగా దొరికిపోతుంటారు. ఇలాంటి భర్తలను భార్యలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సందర్భాలను చాలా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం బీచ్‌లో ఓ భర్త నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. భార్య పక్కన ఉండగానే ఓ భర్త తన పడు బుద్ధిని బయటపెట్టాడు. బీచ్‌లో బికినీలో ఉన్న అమ్మాయిలను వీడియో తీస్తుండగా చివరికి ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బీచ్‌కి (beach) వెళ్లాడు. వెళ్లిన వాడు భార్యతో కలిసి సరదాగా గడపకుండా.. తన వక్ర బుద్ధిని బయటపెట్టాడు. బీచ్‌లో బికినీలతో (Young women in bikinis) ఉన్న అమ్మాయిను చూడగానే తనలోని శాడిస్టు నిద్రలేచాడు. వెంటనే ఫోన్ తీసుకుని బికీనీలో ఉన్న యువతులను వీడియో (Video recording) తీస్తూ ఉన్నాడు. భార్య దూరంగా ఉందిలే.. గమనించలేదు అని అనుకున్నాడు. అతడికి ఎదురుగా దూరంగా బికినీలో ఉన్న యువతులు స్నానం చేస్తూ ఉంటారు. వారిలో ఓ యువతి నడుచుకుంటూ తన వైపే రావడం చూసి కెమెరాను ఆన్ చేశాడు. కెమెరాను ఓ వైపు నుంచి మరో వైపునకు పాన్ చేస్తూ ఉంటాడు.

Bride: పెళ్లి వేదిక నుంచి కాలేజీకి పరుగెత్తుకుంటూ వచ్చిన వధువు.. ఆమెను చూసి అవాక్కైన మీడియా.. విషయం ఏంటని అడిగితే..!

కెమెరాను పూర్తిగా మరో వైపునకు తిప్పగానే సడన్‌గా తన భార్య కనిపించింది. కెమెరాకు దగ్గరగా వచ్చి.. ‘‘ఏం చేస్తున్నావ్.. ఏదీ ఇప్పుడు రికార్డ్ చేయ్ చూద్దాం’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. భార్య మొఖం చూడగానే పరిస్థితిని అర్థం చేసుకుని కెమెరాను అంతటితో ఆఫ్ చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘పాపం! తర్వాత ఈ భర్త ఊహించుకుంటుంటే జాలేస్తోంది’’.. అని కొందరు, ‘‘ఆనందం మొత్తం క్షణాల్లో ఆవిరైంది పాపం’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం పద్ధతి కాదు’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

Updated Date - 2023-05-20T14:53:45+05:30 IST