Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-05-19T15:20:29+05:30 IST

ప్రయాణ సమయాల్లో ఎలాగైనా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో కొందరు చిత్ర విచిత్రమైన సాహసాలు చేస్తుంటారు. రైళ్లలో డోరు వద్ద కూడా ఇరుక్కుని వెళ్లడం, ఆటోలకు వేలాడుతూ ప్రయాణం చేయడం, ఒకే బైకులో నలుగురు, ఐదుగురు వెళ్లడం.. ఇలా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో..

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

ప్రయాణ సమయాల్లో ఎలాగైనా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో కొందరు చిత్ర విచిత్రమైన సాహసాలు చేస్తుంటారు. రైళ్లలో డోరు వద్ద కూడా ఇరుక్కుని వెళ్లడం, ఆటోలకు వేలాడుతూ ప్రయాణం చేయడం, ఒకే బైకులో నలుగురు, ఐదుగురు వెళ్లడం.. ఇలా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొందరి అతి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు.. బైకులో స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుని ప్రయాణించిన తీరు చూసి.. నెటిజన్లు డైరెక్టర్ త్రివిక్రమ్ డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. బైకుపై ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. ఓ మహిళ వెనుక కూర్చుని ఉంటుంది. వారిద్దరికే స్థలం సరిపోవడంతో మరో వ్యక్తి కూర్చోవడానికి అక్కడ స్పేస్ లేదు. అయితే ఎలాగైనా మరో మహిళను తీసుకెళ్లడానికి వారు వినూత్నంగా ఆలోచించారు. వెనుక కూర్చున్న మహిళ (woman) .. తనపై మరో మహిళను కూర్చోబెట్టుకుంది. ఇలా ముగ్గురూ కలిసి తాపీగా (innovative bike ride) బైకుపై వెళ్లడం చూసి.. వెనుక వస్తున్న వాహనదారులు అవాక్కయ్యారు. ఇవెక్కడి తెలివితేటలురా నాయనా... అంటూ ముక్కున వేలేసుకున్నారు.

Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం వింత.. ఈ కార్లు, బైకులన్నీ ఏమైపోతున్నాయో.. ఎలా మాయమైపోతున్నాయో చెప్పగలరా..?

వెంటనే వారిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కొన్నేళ్ల కిందట ఓ అవార్డు పంక్షన్లో సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని (Sirivennela Sitarama Shastri) ఉద్దేశిస్తూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas) అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ‘‘అక్కడ స్పేస్ లేదు.. కానీ ఆయన క్రియేట్ చేసుకున్నాడు’’.. అన్న మాటలను గుర్తు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇలాంటి ప్రయాణం చాలా ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంత చేసుకుంటున్నారు.

Marriage: భర్తకు గుడ్‌బై.. 60 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 28 ఏళ్ల యువతి.. ఈ వయసులో ఇదేం పనని కుటుంబమంతా వ్యతిరేకించినా..!

Updated Date - 2023-05-19T15:20:29+05:30 IST