Crime News: గుమ్మం ముందు కనిపించిన ఓ కాగితపు ఉండ.. ఏంటా అని ఓపెన్ చేసి చదివిన వెంటనే ఆ ఇంట్లో అంతా టెన్షన్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-05-17T20:26:06+05:30 IST

రాను రాను చిన్న పిల్లల్లో కూడా నేర ప్రవర్తన పెరిగిపోతోంది. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు కొందరైతే.. మరికొందరు సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా..

Crime News: గుమ్మం ముందు కనిపించిన ఓ కాగితపు ఉండ.. ఏంటా అని ఓపెన్ చేసి చదివిన వెంటనే ఆ ఇంట్లో అంతా టెన్షన్.. చివరకు..!
ప్రతీకాత్మక చిత్రం

రాను రాను చిన్న పిల్లల్లో కూడా నేర ప్రవర్తన పెరిగిపోతోంది. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు కొందరైతే.. మరికొందరు సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, హర్యానాలో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. గుమ్మం ముందు ఓ కాగితపు ఉండ పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు.. ఏంటా అని ఓపెన్ చేసి చదివారు. చివరకు అంతా టెన్షన్ పడుతూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

హర్యానా (Haryana) సోనిపట్ జిల్లా బహల్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 11ఏళ్ల కిషోర్ బాలుడు, హన్ను (9)అనే బాలిక ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. కిషోర్ తండ్రి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. దీంతో వీరి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు (Financial problems) పడుతోంది. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని కిషోర్.. రోజూ ఆలోచిస్తూ ఉండేవాడు. అయినా అతడి వల్ల సాధ్యం కాలేదు. ఈ క్రమంలో కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బాలిక హన్నును కిడ్నాప్ చేసి, తద్వారా డబ్బు డిమాండ్ చేయాలని అనుకున్నాడు. సోమవారం యథావిధిగా పాఠశాలకు వెళ్లారు.

Crime News: అతడిని ఇంట్లో వాళ్లే చంపి ఉంటారని పోలీసులకు డౌట్.. కుటుంబ సభ్యులందరి ఫోన్లపై నిఘా పెడితే బయటపడిన బండారం..!

boy-crime-news.jpg

పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వస్తుండగా.. హన్నును కిడ్నాప్ చేసి (boy kidnapped the girl) నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అంతకు ముందు ‘‘మీ కూతురిని క్షేమంగా వదిలిపెట్టాలంటే నాకు రూ.6లక్షల డబ్బులు అందజేయాలి’’.. అంటూ ఓ లేఖ రాసి, బాలిక ఇంటి వద్ద విసిరేశాడు. కాగితం చూసిన బాలిక కుటుంబ సభ్యులు కంగారుపడి.. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సమీపంలో ఓ వాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడైన మైనర్ బాలుడిని అరెస్ట్ చేసి, జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral News: ఎంతకు తెగించావురా బుడ్డోడా.. ఎలాగైనా బైక్ కొనుక్కునేందుకు తండ్రికే ఎసరు పెట్టాడు..!

Updated Date - 2023-05-17T20:26:06+05:30 IST