Viral Video: ప్రాణ స్నేహితురాలికి గిఫ్ట్ బాక్స్ కొనిచ్చిందో యువతి.. దాన్ని ఓపెన్ చేయగానే.. ఆమె గురించి అసలు నిజం తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ..!

ABN , First Publish Date - 2023-05-16T21:45:33+05:30 IST

వివాహమైన ఏ మహిళ అయినా త్వరగా అమ్మా.. అని పిలిపించుకోవాలని ఆశ పడుతుంది. కొందరికి ఆ కోరిక త్వరగా తీరితే.. మరికొందరి విషయంలో చాలా ఆలస్యం అవుతుంటుంది. చాలా మందికి లేటు వయసులో సంతానం కలుగుతుంటుంది. తల్లి అయ్యానన్న..

Viral Video: ప్రాణ స్నేహితురాలికి గిఫ్ట్ బాక్స్ కొనిచ్చిందో యువతి.. దాన్ని ఓపెన్ చేయగానే.. ఆమె గురించి అసలు నిజం తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ..!

వివాహమైన ఏ మహిళ అయినా త్వరగా అమ్మా.. అని పిలిపించుకోవాలని ఆశ పడుతుంది. కొందరికి ఆ కోరిక త్వరగా తీరితే.. మరికొందరి విషయంలో చాలా ఆలస్యం అవుతుంటుంది. చాలా మందికి లేటు వయసులో సంతానం కలుగుతుంటుంది. తల్లి అయ్యానన్న వార్త వినగానే.. వారి ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇద్దరు స్నేహితులకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తన ప్రాణ స్నేహితురాలికి గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది. దాన్ని ఓపెన్ చేసిన మహిళ.. చివరకు అసలు నిజం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి (young woman) గిఫ్ట్ బాక్స్ తీసుకుని తన స్నేహితురాలి వద్దకు వెళ్తుంది. టేబుల్ ముందు కూర్చుని ఉన్న స్నేహితురాలికి గిఫ్ట్ బాక్స్ అందించి, ఎదురుగా నిలబడి ఉంటుంది. గిఫ్ట్ బాక్స్ (Gift box) ఓపెన్ చేసి చూడగా.. అందులో రెండు టీషర్ట్‌లు ఉంటాయి. వాటిలో ఒక దానిపై మనలాగే మన పిల్లలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ (Best friends) అని రాసి ఉంటుంది. దాన్ని చూసిన ఆమె ఎంతో సంతోషిస్తుంది. అయితే రెండో టీషర్ట్‌పై కూడా అలాగే రాసి ఉండడం చూసి చివరకు ఆమెకు విషయం అర్థమవుతుంది.

Viral Video: మరీ ఇంత అతి పనికిరాదు తల్లీ.. స్కూటీపై వెళ్తూనే వెనుక కూర్చున్న ఈ యువతి ఏం చేసిందో మీరే చూడండి..!

తన స్నేహితురాలు కూడా గర్భవతి (pregnant) అని, త్వరలో తాను కూడా బిడ్డకు జన్మను ఇవ్వబోతోందని తెలుసుకుని సంతోషంలో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. భావోద్వేగానికి గురై పైకి లేచి వచ్చి.. తన స్నేహితురాలిని కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది ఎంతో భావోద్వేగమైన సన్నివేశం’’.. అని కొందరు, ‘‘ స్నేహితులంటే ఇలాగే ఉండాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: పులి వెనకే కూర్చుని సెల్ఫీకి ఫోజులిస్తున్న ఈ ఇద్దరు స్నేహితులకు.. చివరకు ఎమైందో మీరే చూడండి..!

Updated Date - 2023-05-16T21:45:33+05:30 IST