Accident Video: బైక్‌పై వస్తున్న ఇద్దరు స్నేహితులు.. సడన్‌గా దూసుకొచ్చిన కారు.. కేవలం అయిదు సెకన్లలోనే..!

ABN , First Publish Date - 2023-05-17T18:57:41+05:30 IST

అప్పటిదాకా మన మధ్య సంతోషంగా ఉన్న వారు కొన్నిసార్లు చోటు చేసుకునే ఊహించని ఘటనల వల్ల ప్రమాదానికి గురవుతుంటారు. మరికొందరు అప్పటిదాకా సంతోషంగా ఉండి... అంతలోనే మృత్యు వొడిలోకి జారుకుంటుంటారు. ఇలాంటి..

Accident Video: బైక్‌పై వస్తున్న ఇద్దరు స్నేహితులు.. సడన్‌గా దూసుకొచ్చిన కారు.. కేవలం అయిదు సెకన్లలోనే..!

అప్పటిదాకా మన మధ్య సంతోషంగా ఉన్న వారు కొన్నిసార్లు చోటు చేసుకునే ఊహించని ఘటనల వల్ల ప్రమాదానికి గురవుతుంటారు. మరికొందరు అప్పటిదాకా సంతోషంగా ఉండి... అంతలోనే మృత్యు వొడిలోకి జారుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు స్నేహితులు బైకుపై వెళ్తుండగా.. ఓ కారు సడన్‌గా ఢీకొట్టింది. కేవలం అయిదు సెకన్లలోనే అంతా జరిగిపోయింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఉజ్జయిని పరిధి నాగ్‌జిరి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోండియా ప్రాంతానికి చెందిన వీరేందర్ సింగ్ (35), బదర్‌ఖా ప్రాంతానికి చెందిన ఫరూఖ్ పటేల్ (26) కలిసి.. మే 8న బసంత్ విహార్ జరుగుతున్న నిర్మాణ పనులకు బైకుపై వెళ్తున్నారు. స్థానిక జాగృతి దాబా వద్ద ఉన్న కూడిలికి చేరుకోగానే మరోవైపు నుంచి వేగంగా వచ్చిన కారు.. బైకును (car hit a bike) ఢీకొంది. ఈ ప్రమాదంలో వారు ఎగిరి పది అడుగుల దూరంలో పడ్డారు. ఇద్దరికీ హెల్మెట్ (Helmet) కూడా లేకపోవడంతో తల రోడ్డుకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు.

Crime News: అతడిని ఇంట్లో వాళ్లే చంపి ఉంటారని పోలీసులకు డౌట్.. కుటుంబ సభ్యులందరి ఫోన్లపై నిఘా పెడితే బయటపడిన బండారం..!

ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనం వదిలి పారిపోయాడు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో వీరేంద్ర చికిత్స పొందుతూ మే 10న చనిపోయాడు. ఫరూఖ్ చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. సదరు వాహనం సుస్నర్ ప్రాంత పరిధి మోడీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినగా గుర్తంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో (Viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral News: ఎంతకు తెగించావురా బుడ్డోడా.. ఎలాగైనా బైక్ కొనుక్కునేందుకు తండ్రికే ఎసరు పెట్టాడు..!

Updated Date - 2023-05-17T18:57:41+05:30 IST