Viral News: ఎంతకు తెగించావురా బుడ్డోడా.. ఎలాగైనా బైక్ కొనుక్కునేందుకు తండ్రికే ఎసరు పెట్టాడు..!

ABN , First Publish Date - 2023-05-17T15:09:50+05:30 IST

కొందరు పిల్లల తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు పిల్లలు వివిధ రకాల ఆట వస్తువులు తదితరాల కోసం తల్లిదండ్రులను తెగ ఇబ్బంది పెడుతుంటారు. వారికి కావాల్సినవి కొనిచ్చే వరకూ మారాం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పిల్లల గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. అయితే..

Viral News: ఎంతకు తెగించావురా బుడ్డోడా.. ఎలాగైనా బైక్ కొనుక్కునేందుకు తండ్రికే ఎసరు పెట్టాడు..!

పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే వారి నడవడికపై దృష్టి పెట్టి.. సక్రమమైన మార్గంలో నడిచేలా వారికి విద్యాబుద్ధులు నేర్పించాలి. తల్లిదండ్రులు చేసే తప్పులు కొన్నిసార్లు పిల్లలపై ప్రభావం చూపుతుంటాయి. కొందరు పిల్లల తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు పిల్లలు వివిధ రకాల ఆట వస్తువులు తదితరాల కోసం తల్లిదండ్రులను తెగ ఇబ్బంది పెడుతుంటారు. వారికి కావాల్సినవి కొనిచ్చే వరకూ మారాం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పిల్లల గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుడ్డోడు ఇందుకు పూర్తి విరుద్ధం. ఎలాగైనా బైక్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఏకంగా తండ్రికే ఎసరు పెట్టాడు. ఇతడు చేసిన పని తెలుసుకుని నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు. ఎంతకు తెగించావురా బుడ్డోడా.. అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియలో ఓ వార్త తెగ చక్కర్లు (Viral News) కొడుతోంది. యాష్ అనే వ్యక్తికి 8ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇతను తన కొడుక్కు.. ఇష్టమైన వస్తువుల కొనేందుకు డబ్బు పొదుపు ఎలా చేయాలనే విషయాలపై తరచూ అవగాహన కల్పిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొడుకు పాత బూట్లను ఆన్‌లైన్‌లో (Online shopping) ఎలా విక్రయించాలో తెలుసుకున్నాడు. తర్వాత తనకు పిల్లలకు సంబంధించిన బైకు (Childrens bike) తీసుకోవాలని తండ్రిని కోరాడు. ఇందుకోసం ఇప్పటి నుంచే డబ్బులు పొదుపు చేసుకోమని తండ్రి సూచించాడు.

Viral News: ఒకరికి 25 ఏళ్లు.. మరొకరికి 50 ఏళ్ల వయసు.. ఇద్దరూ తల్లీకూతుళ్లే.. సడన్‌గా ఎందుకు వార్తల్లోకి ఎక్కారంటే..

boy-trending-news.jpg

అయితే ఎలాగైనా వెంటనే బైకు కొనాలని పిల్లాడు అనుకున్నాడు. ఇందుకోసం తన తల్లి ఫోన్ తీసుకుని, అందులోని యాప్ ద్వారా తండ్రికి సంబంధించిన ఖరీదైన వాచ్ (expensive watch) , ఉంగరాన్ని ఫొటో తీసి విక్రయానికి పెట్టాడు. వాచ్‌ను £100 (రూ.10,242.15) లకు అమ్మకానికి పెట్టాడు. ఇటీవల తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పరిశీలించగా విషయం బయటపడింది. ప్రస్తుతం బాలుడి నిర్వాకానికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఎంతకు తెగించావురా బుడ్డోడా!’’.. అని కొందరు, ‘‘వీడు మామూలోడు కాదురోయ్’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: మరీ ఇంత అతి పనికిరాదు తల్లీ.. స్కూటీపై వెళ్తూనే వెనుక కూర్చున్న ఈ యువతి ఏం చేసిందో మీరే చూడండి..!

Updated Date - 2023-05-17T15:09:50+05:30 IST