Crime News: అతడిని ఇంట్లో వాళ్లే చంపి ఉంటారని పోలీసులకు డౌట్.. కుటుంబ సభ్యులందరి ఫోన్లపై నిఘా పెడితే బయటపడిన బండారం..!

ABN , First Publish Date - 2023-05-17T17:33:53+05:30 IST

ఆ కుటుంబంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు.. కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చింది. దీంతో సుమారు 15 రోజుల పాటు మృతుడి కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టారు. చివరగా..

Crime News: అతడిని ఇంట్లో వాళ్లే చంపి ఉంటారని పోలీసులకు డౌట్.. కుటుంబ సభ్యులందరి ఫోన్లపై నిఘా పెడితే బయటపడిన బండారం..!
ప్రతీకాత్మక చిత్రం

ఆ కుటుంబంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు.. కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చింది. దీంతో సుమారు 15 రోజుల పాటు మృతుడి కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టారు. చివరగా మృతుడి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిపై మరింత అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు వారు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) పాట్నా బెగుసరాయ్‌లోని బచ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన శివం, శుభం అనే వ్యక్తులు అన్నాదమ్ముళ్లు. ఇదిలావుండగా, తమ్ముడు శుభం.. తన అన్న శివం భార్యతో ఇటీవల చనువుగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair with brothers wife) ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. అయితే ఇద్దరూ వివాహం (marriage) చేసుకుని, జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకోసం అడ్డుగా ఉన్న శివంను చంపేయాలని నిర్ణయించుకున్నారు.

Crime News: నట్టింట్లో తల్లిదండ్రుల మృతదేహాలు.. కొడుకు చేతికి గాయం చూసి పోలీసులకు డౌట్.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ఇదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పి.. చివరకు అంతా కలిసి పక్కా స్కెచ్ వేశారు. ఏప్రిల్ 30న అన్నను తీసుకుని జాతరకు వెళ్లాడు. మార్గ మధ్యలో నిర్మానుష్య ప్రదేశంలో అన్నపై స్నేహితుడితో కలిసి తుపాకీ కాల్పులు (Assault on brother) జరిపాడు. ఈ ఘటనలో శివం అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహంతో పాటూ మృతుడి బైకును కూడా మాయం చేశారు. తర్వాత తన అన్న కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో కదరాబాద్ గ్రామం గ్యాస్ పైప్‌లైన్ సమీపంలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Viral News: ఒకరికి 25 ఏళ్లు.. మరొకరికి 50 ఏళ్ల వయసు.. ఇద్దరూ తల్లీకూతుళ్లే.. సడన్‌గా ఎందుకు వార్తల్లోకి ఎక్కారంటే..

women-crime-news.jpg

అయితే విచారణలో మృతుడి భార్య, తమ్ముడు విపరీతంగా ఏడుస్తూ ఉండడం చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే 15 రోజుల పాటు వారిద్దరితో పాటూ కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వివరాలను (phone calls Details) పరిశీలించడంతో అనుమానం మరింత బలపడింది. చివరకు మృతుడి భార్య, తమ్ముడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral News: ఎంతకు తెగించావురా బుడ్డోడా.. ఎలాగైనా బైక్ కొనుక్కునేందుకు తండ్రికే ఎసరు పెట్టాడు..!

Updated Date - 2023-05-17T17:52:23+05:30 IST