Viral News: అమ్మ బాబోయ్.. ఏంటీ ఘోరం.. అమ్మాయే కానీ మగాడినంటూ రెండేళ్ల పాటు ప్రేయసిని నమ్మించింది..!

ABN , First Publish Date - 2023-05-18T17:26:34+05:30 IST

ఈ ఇద్దరి మహిళలది విచిత్రమైన సమస్య. ఇద్దరూ ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమయ్యారు. అయితే వీరిలో ఓ మహిళ తనను తాను మగాడిలా పరిచయం చేసుకుంది. అలా ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం రెండేళ్ల పాటు మగాడిలానే ప్రేయసిని నమ్మించింది. చివరకు ..

Viral News: అమ్మ బాబోయ్.. ఏంటీ ఘోరం.. అమ్మాయే కానీ మగాడినంటూ రెండేళ్ల పాటు ప్రేయసిని నమ్మించింది..!
ప్రతీకాత్మక చిత్రం

ఈ ఇద్దరి మహిళలది విచిత్రమైన సమస్య. ఇద్దరూ ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమయ్యారు. అయితే వీరిలో ఓ మహిళ తనను తాను మగాడిలా పరిచయం చేసుకుంది. అలా ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం రెండేళ్ల పాటు మగాడిలానే ప్రేయసిని నమ్మించింది. చివరకు ఓ రోజు అనుకోకుండా ఆమె బండారం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా అమ్మ బాబోయ్.. ఏంటీ ఘోరం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆమె.. అతడు కాదు అని సదరు యువతికి ఎలా తెలిసిందంటే..

యూకేకి (UK) చెందిన మహిళకు రెండేళ్ల కిందట 40 ఏళ్ల బ్లేడ్ సిల్వానో అనే మహిళ డేటింగ్ యాప్‌లో (dating app) పరిచయమైంది. సిల్వానో తనకు తాను మగాడిలా పరిచయం చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ (Chatting) చేసుకునేవారు. ఇలా వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడంతో చివరికి కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లోకి మారారు. సిల్వానో పైకి పురుషుడి వేషంలో కనిపిస్తూ తన ప్రేయసికి ఎక్కడా అనుమానం రాకుండా మ్యానేజ్ చేసేవాడు. రాత్రి వేళల్లో ప్రియురాలి (girlfriend) కళ్లకు గంతలు కట్టడంతో పాటూ దగ్గరికి రానిచ్చేవాడు కాదు.

Crime News: ఈ 33 ఏళ్ల కుర్రాడి గూగుల్ హిస్టరీతోనే 42 ఏళ్ల మహిళ మర్డర్ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఇతడు ఫోన్లో ఏం సెర్చ్ చేశాడో తెలిస్తే..!

ఇలా సిల్వానో.. తాను మహిళ అని తెలియకుండా కవర్ చేసేది. శ్రుంగార సమయంలోనూ ప్రేయసి తన శరీరాన్ని తాకకుండా జాగ్రత్తలు తీసుకునేది. ఇలా సుమారు రెండేళ్ల పాటు ఇద్దరూ కలిసి (Live in relationship) సహజీవనం చేశారు. అయితే ఇటీవల సిల్వానో ప్రేయసి.. ఫేస్‌బుక్‌లో (Facebook) సెర్చ్ చేస్తుండగా.. అచ్చం సిల్వానోలాగా ఉండే ఓ మహిళ ఫొటోలు కనిపించాయి.. ఆ ప్రొఫైల్‌లోకి వెళ్లి చూస్తే అది నిజంగా సిల్వానోయే అని ఆమె గ్రహించింది. ఇన్నాళ్లూ తనతోపాటు ఉన్నది అబ్బాయి కాదనీ.. అమ్మాయేనన్న షాకింగ్ నిజం తెలిసి ఆమె విస్తుబోయింది. తాను మోసపోయానని తెలుసుకుని చివరకు కోర్టుకెక్కింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. కాగా, ఈ ఇద్దరి మహిళల సహజీవనానికి సంబంధించిన వార్త (Viral news) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral News: ఒకరికి 25 ఏళ్లు.. మరొకరికి 50 ఏళ్ల వయసు.. ఇద్దరూ తల్లీకూతుళ్లే.. సడన్‌గా ఎందుకు వార్తల్లోకి ఎక్కారంటే..

Updated Date - 2023-05-18T17:26:34+05:30 IST