Wife: వారెవ్వా.. ఏం తెలివి తల్లీ.. డబ్బంతా ఏం చేశావని భర్త అడుగుతాడని ఓ భార్య మాస్టర్ ప్లాన్.. పోలీసులు మొదట నమ్మేశారు కానీ..!

ABN , First Publish Date - 2023-05-17T21:49:49+05:30 IST

సాధారణంగా భర్తలు సంపాదిస్తుంటే.. భార్యలు పొదుపు చేస్తూ ఉంటారు. ఇంటి ఖర్చులకు పోనూ మిగతా డబ్బులను పోగు చేస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్ కోసం దాదాపు ఏ మహిళ అయినా ఇలాగే చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే మహిళ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా..

Wife: వారెవ్వా.. ఏం తెలివి తల్లీ.. డబ్బంతా ఏం చేశావని భర్త అడుగుతాడని ఓ భార్య మాస్టర్ ప్లాన్.. పోలీసులు మొదట నమ్మేశారు కానీ..!
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా భర్తలు సంపాదిస్తుంటే.. భార్యలు పొదుపు చేస్తూ ఉంటారు. ఇంటి ఖర్చులకు పోనూ మిగతా డబ్బులను పోగు చేస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్ కోసం దాదాపు ఏ మహిళ అయినా ఇలాగే చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే మహిళ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. భర్త విదేశాల్లో ఉంటూ ప్రతి నెలా భార్యకు డబ్బులు పంపించేవాడు. త్వరలో స్వదేశానికి వస్తున్న భర్త.. డబ్బులు ఏం చేశావని అడుగుతాడనే భయంతో భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. పోలీసులు కూడా మొదట నమ్మేశారు కానీ.. చివరకు అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర (Maharashtra) పాల్ఘర్ జిల్లా పరిధి వసాయి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నాడు. ఇతడు ప్రతి నెలా ఇంటి వద్ద ఉన్న భార్యకు డబ్బులు పంపించేవాడు. భర్త పంపించే డబ్బులను దాచాల్సిన భార్య.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. భర్త పంపే డబ్బులను ఏ నెలకు ఆ నెల ఖర్చు చేయడంతో పాటూ (wife stole the money) మరికొంత నగదు, బంగారు నగలను తన సోదరుడి వద్ద ఉంచుతూ వచ్చింది. అయితే ఇటీవల భర్త విదేశాల నుంచి ఇంటికి వస్తున్నట్లు తెలిసింది. భర్త వస్తే పంపిన డబ్బులకు మొత్తం లెక్క చెప్పాల్సి వస్తుందని ఆమె భయపడింది. ఎదోటి చేసి భర్తను నమ్మించాలని కుట్ర పన్నింది.

Crime News: గుమ్మం ముందు కనిపించిన ఓ కాగితపు ఉండ.. ఏంటా అని ఓపెన్ చేసి చదివిన వెంటనే ఆ ఇంట్లో అంతా టెన్షన్.. చివరకు..!

చివరికి ఓ నిర్ణయానికి వచ్చి.. మే 9న నేరుగా మాణిక్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి రూ.10.30 లక్షల విలువైన నగలు, నగదును ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. అయితే దోపిడీ జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేకపోవడంతో సదరు మహిళపై అనుమానం కలిగింది. చివరకు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ సోదరుడి ఇంటికి వెళ్లి నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral News: ఎంతకు తెగించావురా బుడ్డోడా.. ఎలాగైనా బైక్ కొనుక్కునేందుకు తండ్రికే ఎసరు పెట్టాడు..!

Updated Date - 2023-05-17T21:49:49+05:30 IST