Viral Video: జింకలను వేటాడుతూ నీళ్లలోకి దూకిన పులి.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ABN , First Publish Date - 2023-05-19T16:25:56+05:30 IST

ఎంత పెద్ద జంతువులకైనా.. కొన్ని సార్లు చిన్న చిన్న జంతువుల చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరికొన్నిసార్లు విధి వక్రించి చివరకు.. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా పరిస్థితి తారుమారు అవుతుంటుంది. క్రూరమృగాల వేట సమయంలో అప్పుడప్పుడూ..

Viral Video: జింకలను వేటాడుతూ నీళ్లలోకి దూకిన పులి.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ఎంత పెద్ద జంతువులకైనా.. కొన్ని సార్లు చిన్న చిన్న జంతువుల చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరికొన్నిసార్లు విధి వక్రించి చివరకు.. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా పరిస్థితి తారుమారు అవుతుంటుంది. క్రూరమృగాల వేట సమయంలో అప్పుడప్పుడూ విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ పులికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జింకను వేటాడే క్రమంలో ఓ పులి నీటిలోకి దూకుతుంది. అయితే చివరకు ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇలా జరుగుతుందని పులి ఊహించలేకపోయింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అటవీ ప్రాంతంలో కొన్ని జింకలు మేత మేస్తూ ఉంటాయి. పక్కనే ఉన్న గడ్డి పొదల మధ్య ఓ పులి నక్కి ఉంటుంది. ఎలాగైనా జింకలను వేటాడాలని సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. జింకలు ఏమరపాటుగా ఉన్న సమయంలో ఒక్కసారిగా వాటి పైకి (Tiger attack on deer) దూసుకొస్తుంది. పులి సమీపానికి వచ్చేలోపు జింకలు అలెర్ట్ అయ్యి.. చెరో వైపు పరుగందుకుంటాయి. వాటిలో ఓ జింక పులి నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి దూకుతుంది. పులి కూడా జింక వెంటే నీటిలోకి దూసుకెళ్తుంది.

Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం వింత.. ఈ కార్లు, బైకులన్నీ ఏమైపోతున్నాయో.. ఎలా మాయమైపోతున్నాయో చెప్పగలరా..?

మధ్యలో జింకపై దాడి చేయాలని చూస్తుంది. అయితే జింక చాలా తెలివిగా నీటిలోకి మునిగి దూరంగా పైకి తేలుతుంది. అత్యంత వేగంగా ఈదుతూ ఒడ్డుకు చేరుకుని అడవిలోకి పారిపోతుంది. అయితే పులి మాత్రం నీటిలో నెమ్మదిగా ఈదుతూ అటూ ఇటూ చూసుకుంటూ ఉంటుంది. ఒడ్డుకు వచ్చే లోపు జింకలు కనిపించకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ జింకల తెలివి మామూలుగా లేదుగా’’.. అని కొందరు, ‘‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

Updated Date - 2023-05-19T16:25:56+05:30 IST