Viral News: 11 ఏళ్ల ఈ పాప ఇలా నవ్వుతోంది కానీ.. గుండె నిండా బాధే.. అరుదైన వ్యాధితో నడవలేక నరకం.. ఆపరేషన్ కూడా ప్రమాదమేనని..!

ABN , First Publish Date - 2023-05-19T18:31:36+05:30 IST

కొందరు పైకి సంతోషంగా కనిపించినా.. లోలోపల ఎంతో బాధను భరిస్తూ ఉంటారు. మరికొందరు అంతు చిక్కని వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఖరీదైన వైద్యం చేయించలేక, మరోవైపు బాధను భరించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు..

Viral News: 11 ఏళ్ల ఈ పాప ఇలా నవ్వుతోంది కానీ.. గుండె నిండా బాధే.. అరుదైన వ్యాధితో నడవలేక నరకం.. ఆపరేషన్ కూడా ప్రమాదమేనని..!

కొందరు పైకి సంతోషంగా కనిపించినా.. లోలోపల ఎంతో బాధను భరిస్తూ ఉంటారు. మరికొందరు అంతు చిక్కని వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఖరీదైన వైద్యం చేయించలేక, మరోవైపు బాధను భరించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. అయ్యో పాపం! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ బాలికకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 ఏళ్ల బాలిక గురించి తెలుసుకుని.. అంతా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన 11 ఏళ్ల ఏంజిల్ అనే బాలిక అరుదైన వ్యాధితో (girl suffering from rare disease) బాధపడుతోంది. దీని కారణంగా ఆమె కాళ్లల్లో వాపు వచ్చింది. చివరకు నడవలేని స్థితికి వచ్చింది. ప్రస్తుం వీల్ చైర్‌కే పరిమితమైంది. బాలికను చికిత్సం నిమిత్తం 2019లో ఆస్ట్రేలియాలోని (Australia) మెల్‌బోర్న్‌లోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బాలికకు క్లోవ్స్ సిండ్రోమ్ (cloves syndrome) అనే అరుదైన వ్యాధి సోకిందని తేల్చారు. ఆపరేషన్ చేయడం చాలా ప్రమాదకరమని, చివరకు బాలిక రెండు కాళ్లను తొలగించాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలో అక్కడి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చిన్నారికి పరీక్షలు చేయించేందుకు ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ఆ వ్యాధికి పారిస్‌లో (Paris) అధునాతన చికిత్స అందుబాటులో ఉందని తెలుసుకున్నాడు.

Viral Video: జింకలను వేటాడుతూ నీళ్లలోకి దూకిన పులి.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం పారిస్‌కి తీసుకెళ్లారు. సుమారు రూ.54లక్షల ఖరీదు చేసే చికిత్స (Expensive treatment చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రొమ్ము కేన్సర్‌కు వినియోగించే మందులతో బాలికకు వైద్యం చేయించారు. వైద్యులు మాట్లాడుతూ తాము ఇస్తున్న చికిత్సతో బాలిక కాళ్ల వాపు తగ్గి, త్వరలో నడిచే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్లోవ్స్ సిండ్రోమ్ కేసులు 200 కంటే తక్కువ నమోదయ్యాయని వారు వివరించారు. కాగా, బాలిక సమస్యకు సంబంధించిన వార్త (Viral news) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

Updated Date - 2023-05-19T18:31:36+05:30 IST