Viral Video: గుడ్డివాడిగా నటిస్తూ ఓ కుర్రాడు చేసిన నిర్వాకమిదీ.. చుట్టూ ఉన్నవాళ్లంతా భయంతో పరుగులు తీశారు..!

ABN , First Publish Date - 2023-05-19T21:13:48+05:30 IST

సోషల్ మీడియా ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో యువత తమ టాలెంట్‌కు పదును పెట్టి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. మరికొందరు రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు..

Viral Video: గుడ్డివాడిగా నటిస్తూ ఓ కుర్రాడు చేసిన నిర్వాకమిదీ.. చుట్టూ ఉన్నవాళ్లంతా భయంతో పరుగులు తీశారు..!

సోషల్ మీడియా ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో యువత తమ టాలెంట్‌కు పదును పెట్టి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. మరికొందరు రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు ప్రాంక్ వీడియోల (Prank videos) పేరుతో జనాలను భయపెడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి గుడ్డి వాడిగా నటిస్తూ చేసిన నిర్వాకానికి.. చుట్టూ ఉన్న జనాలంతా భయంతో పరుగులు తీశారు.

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. పాదచారుల రాకపోకలతో ఓ రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇంతలో కళ్లు కనపడని వాడిలా (man acting like blind man) నటిస్తూ ఓ వ్యక్తి కర్ర సాయంతో నడుచుకుంటూ వస్తాడు. అంతా అతడు అంధుడేమో అనుకుంటారు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటిదాకా కళ్లు కనపడనట్లు నటించిన వ్యక్తి.. ఒక్కసారిగా రోడ్డు పైకి బోర్లా పడిపోతాడు. ఆ వెంటనే తల రోడ్డుపై ఉంచి పల్టీ (Stunts) కొడతాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది.

Viral Video: జింకలను వేటాడుతూ నీళ్లలోకి దూకిన పులి.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. పలువురు మహిళలు భయంతో అక్కడి నుంచి వామ్మో! అనుకుంటూ అక్కడి నుంచి పరుగులు పెడతారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొత్తానికి అందరినీ హడలెత్తించావు కదరా’’.. అని కొందరు, ‘‘రీల్స్ పిచ్చి పీక్స్‌కు వెళ్తోంది’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చి ప్రాంక్‌లు మానుకో’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

Updated Date - 2023-05-19T21:13:48+05:30 IST