Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-11-12T10:05:30+05:30
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని తెలంగాణ పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం
తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని తెలంగాణ పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలని దేవుడ్ని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ, తెలంగాణ సంబంధాలు బాగుండాలని కూడా వేడుకున్నానని తెలిపారు. అంతేగాక త్వరలో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-11-12T10:05:32+05:30 IST