ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kanakamedala: కక్షపూరిత రాజకీయాలతో జగన్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతోంది

ABN, Publish Date - Dec 25 , 2023 | 04:10 PM

కక్షపూరిత రాజకీయాలతో జగన్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ( Kanakamedala Ravindra Kumar ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ప్రభుత్వ స్కీముల పేరుతో స్క్యాములకు పాల్పడుతోంది. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయి’’ అని కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు.

అమరావతి: కక్షపూరిత రాజకీయాలతో జగన్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ( Kanakamedala Ravindra Kumar ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ప్రభుత్వ స్కీముల పేరుతో స్క్యాములకు పాల్పడుతోంది. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తోంది. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యం. ప్రభుత్వం ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపితే, అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికులను భయపెట్టి పలాయనం చిత్తగించేలా చేశారు. జాకీ, లూలూ, రిలయన్స్, డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటర్ కంపెనీలు ఏపీలో క్లోజ్ అయ్యాయి. దాదాపు 2 లక్షల ఉద్యోగస్తులు రోడ్ల పాలయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతం ఉంది. రాష్ట్రంలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. రాజకీయాల పరంగా ప్రతిపక్ష నాయకుల ఆస్తులను వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు’’ అని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.

Updated Date - Dec 25 , 2023 | 04:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising