ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. బుధవారం నాడు నేలకొండపల్లిలో తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నూతన ప్రభుత్వం ప్రజా అనుకూల పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Congress MLAS ) గందరగోళంలో ఉన్నారని, బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సింహాలా బయటకు వస్తారు. సమయం చెప్పలేము. బీఆర్ఎస్‌కు 39 సీట్లొచ్చాయి’’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) లో నిరాశలో ఉన్ననేతలు కూడా తనకు మెసేజ్‌లు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఎన్నికలల్లో అనుకోని ఫలితాలు రావడం సహజం, నిరాశ పడాల్సిన అవసరం లేదు’’ అని కేటీఆర్ తెలిపారు.
ఇక తెలంగాణ డీజీపీ రేసులో పలువురు ఐపీఎస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇంచార్జ్ డీజీపీగా రవి గుప్తా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక
తెలంగాణ సీఎం, సీఎల్పీ నేత, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌కి చేరుకున్నారు. స్పీకర్ ఓం బిర్లా ( Speaker Om Birla ) ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు.
బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే గత నాలుగు రోజులుగా ఉంటున్నారు.
రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. తొలుత గురువారం ఉదయం 10:28 నిమిషాలకు నిర్ణయించారు. కానీ తాజాగా ఆ సమయాన్ని ఛేంజ్ చేశారు.
అనుముల రేవంత్‌రెడ్డి.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరిది! రాజకీయ అరంగేట్రంలోనే సంచలనాలు! నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. స్వతంత్రంగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి.. రాజకీయ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలోనూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భం గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేదు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ని అధికారంలోకి తీసుకు రావడానికి సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఎంతో కృషి చేశారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. మంగళవారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... సోదరుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.