Chandrababu : పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు.. కారణమేంటంటే..?
ABN, Publish Date - Dec 17 , 2023 | 09:14 PM
నగరంలోని జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) నివాసానికి తెలుగుదేశం ( TDP ) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. పవన్ నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
హైదరాబాద్: నగరంలోని జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) నివాసానికి తెలుగుదేశం ( TDP ) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. పవన్ నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు.. ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణపై కూడా వీరి భేటీలో చర్చించినట్లు సమాచారం. ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
సీట్ల సర్దుబాటుపై కొలిక్కి..?
అయితే.. టీడీపీ ( TDP ) మహానాడులో సూపర్‌సిక్స్ పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టోకి జనసేన (Janasena) పార్టీ మరికొన్ని అంశాలు జోడించాలని చెప్పింది. మొత్తం 10 అంశాలతో రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాలను జనసేన సూచించినట్టు తెలుస్తోంది. రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో.. ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఇప్పటికే టీడీపీ చేపట్టిన కార్యక్రమం పేరులోనూ మార్పులు చేయనున్నట్టు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల ఫొటోలు ముద్రించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని సమాచారం.
కాగా... ఏపీలో తెలుగుదేశం ( TDP ) , జనసేన (Janasena)ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి జనసేనాని నివాసానికి చంద్రబాబు వెళ్లడం ఇదే తొలిసారి.
Updated Date - Dec 17 , 2023 | 09:46 PM