ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Love as Transformation: మార్పు కోసమే ఈ ప్రేమతత్త్వం

ABN, Publish Date - Jan 02 , 2026 | 12:59 AM

మానవ భావోద్వేగాలు అన్నిటిలో అత్యంత అపార్థానికి, వక్రీకరణకు, దుర్వినియోగానికి గురయిన భావన ప్రేమ. సర్వవ్యాపకమైన ప్రేమ క్రమంగా కుదించుకుపోయింది. మొదట...

యోగా

మానవ భావోద్వేగాలు అన్నిటిలో అత్యంత అపార్థానికి, వక్రీకరణకు, దుర్వినియోగానికి గురయిన భావన ప్రేమ. సర్వవ్యాపకమైన ప్రేమ క్రమంగా కుదించుకుపోయింది. మొదట సినిమారంగం దాన్ని కేవలం శృంగారపరమైన ఆకర్షణగా చేస్తే... ఆ తరువాత సోషల్‌ మీడియా దాన్ని కేవలం క్షణికమైన ప్రదర్శనలు, ప్రకటనలు, లావాదేవీల స్థాయికి దిగజార్చి మరింత సంకుచితం చేసింది.

ఆ పరిధిలో బందీగా...

ప్రేమ విషయంలో మనకు ఉన్న అనుభవం సాధారణంగా కొన్ని దశల్లో పరిణతి చెందుతుంది. బాల్యంలో తల్లిదండ్రుల నిస్వార్థమైన ప్రేమను పొందుతాం. యవ్వనంలో ప్రేమ తరచుగా ఆకర్షణతో కూడిన భావోద్వేగంగా మారుతుంది. ఆ తరువాత తల్లిదండ్రులుగా మన పిల్లల ద్వారా ఆ ప్రేమను మళ్ళీ అనుభూతి చెందుతాం. కొందరు దీన్ని ఇంకొంచెం విస్తరించి... బంధువులు, సన్నిహితులు, అప్పుడప్పుడు ఉద్యోగ సహచరులవరకూ తీసుకువెళతారు. ప్రేమ తాలూకు పరిపూర్ణ వ్యక్తీకరణ ఇదేనని చాలామందికి అనిపిస్తుంది. అయినప్పటికీ... విస్తరించిన ఈ ప్రేమ కూడా ‘నేను, నాది, నావాళ్ళు’ అనే పరిధిలోనే బందీ అయి ఉంటుంది. ఇక్కడే ఒక లోతైన పరిశీలన అవసరం అవుతుంది. అదే ప్రేమ తాలూకు ఆధ్యాత్మిక కోణం. సరళమయినవే కానీ... ఒక సందర్భంలో రెండు గంభీరమైన వాక్యాలు నాలో ఆసక్తి రేకెత్తించాయి. అవి: అందరినీ ప్రేమించే ఆయనను ప్రేమించు. ఆయన ప్రేమించేవారందరినీ ప్రేమించు.

కొత్త అవగాహన

‘అందరినీ ప్రేమించే ఆయనను ప్రేమించడం’ అనేది కేవలం ఒక సంక్షిప్తమైన, భిన్నమైన, ఆచరణ సాధ్యంకాని సిద్ధాంతంలా అనిపించింది. కంటికి కనిపించనిదాన్ని ప్రేమించడం ఎలా? నాతో సహా చాలామందికి మొదట్లో అది అసాధ్యంగా అనిపించింది. అయితే... ఆయన ‘ప్రేమించేవారందరినీ ప్రేమించు’ అనే వాక్యం ఒక కొత్త అవగాహనకు తెరతీసింది. ప్రేమ అనేది కొందరికే పరిమితం కాదనీ, అది విశ్వజనీనమనీ, షరతులు లేనిదనీ, లావాదేవీలకు అతీతమనీ, దానికి ఎలాంటి అంచనాలు, హక్కులు లేదా కారణాలు ఉండవని ఇది తెలిపింది. ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ పద్ధతి సూచించినట్టు... అంతర్లీన దివ్యత్వం గురించి ధ్యానం చేయడం ప్రారంభించినప్పుడు నా ప్రయాణం మరింత లోతుగా సాగింది. నెమ్మదిగా, నాకు తెలియకుండానే నాలో ఉన్న సంస్కారాల పొరలు కరగడం మొదలైంది. అప్పుడు నాలో కలిగినది దేని మీదో నిర్దేశితమైన భావోద్వేగం కాదు, నేను ప్రవేశించిన ఒక అత్యుత్తమమైన అస్తిత్వ స్థితి.

నేర్వడం కాదు, ఎదగాలి

గాఢమైన ధ్యానంలో... మన ధ్యాన వస్తువు పట్ల (అది భగవంతుడు కావచ్చు, దైవత్వం కావచ్చు, స్వచ్ఛమైన అంతర్గత శక్తి కావచ్చు) అపారమైన ప్రేమతో కూర్చున్నప్పుడు... సూక్ష్మమైనదే అయినా చాలా విప్లవాత్మకమైన పరివర్తన జరుగుతుంది. ఆ తత్త్వంతో ఒక పరస్పర అనుసంధానం (ఆస్మోసిస్‌) జరుగుతుంది. ఆ క్షణంలో ‘అందరినీ ప్రేమించే ఆయనను ప్రేమించు’ అనే దానికి అర్థం కేవలం ఒక ఆలోచనగా కాకుండా... ఒక ప్రత్యక్ష అనుభవంగా మారుతుంది. అప్పుడు ప్రేమ అనేది మనం చేసే ఒక పని కాకుండా... మనమే ప్రేమ స్వరూపం అవుతాం. ఆ స్థితిలో ప్రేమ అనేది లక్ష్యం లేనిదిగా, ప్రయత్నం అవసరం లేనిదిగా, ఉద్దేశం లేనిదిగా ఉన్నప్పటికీ ఎంతో సజీవంగా ఉంటుంది. ఇది మతం, కులం, జాతి, వృత్తి లేదా సిద్ధాంతాలకు అతీతంగా... ప్రతి ఒక్కరినీ, ప్రతిదాన్నీ మనతో సహజంగా కలుపుతుంది. దాన్ని ప్రత్యేకంగా వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. మన ప్రతి ఆలోచన, మాట, చర్య ద్వారా దానంతట అదే వ్యక్తమవుతుంది. ఒక వ్యక్తి ఈ స్థితిలో ఉన్నప్పుడు... ఈ ప్రేమ కుటుంబ జీవితం, సామాజిక సంబంధాలు, వృత్తిపరమైన ప్రవర్తనలో అంతర్భాగమైపోతుంది. ఇలాంటి అస్తిత్వ స్థితిలో పని చేస్తున్న ఒక వైద్యుణ్ణి ఊహించుకోండి. డబ్బు, అహంకారం లేదా స్వార్థం అతని నిర్ణయాలను ప్రభావితం చేయగలవా? అసంభవం. ప్రేమ నిండిన ఆ స్థితి ఇచ్చే స్పష్టత... సరైన దాన్ని మాత్రమే వ్యాప్తి చేస్తుంది. అలాగే నాయకులు, రాజకీయవేత్తలు, అధికారులు, నిపుణులు సైతం అదే అంతరంగ స్థితిలో ఉండి పని చేస్తున్నట్టు ఊహించండి. అప్పుడు మనం నివసించే ప్రపంచం ఎలా ఉంటుంది? అలాంటి మార్పు రావాలంటే... ప్రేమను అపార్థాల నుంచి, సంకుచిత నిర్వచనాల నుంచి విడిపించాలి. ప్రేమను కేవలం తెలుసుకోవడమే కాకుండా.... నిస్వార్థంగా, స్వచ్ఛంగా అనుభూతి చెందే పద్ధతులను మనం అన్వేషించాలి. బహుశా మానవాళి భవిష్యత్తు మరింతగా నేర్చుకోవడంలో లేదు. నిజమైన ప్రేమను చేరుకొని, అందులో మరింత ఉన్నతంగా ఎదగడంలో ఉంది.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌,

ట్రైనర్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌. 9440087532

ఇవి కూడా చదవండి...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 12:59 AM