ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Year Ender 2025: కేసీఆర్ కుటుంబానికి కలిసిరాని కాలం...

ABN, Publish Date - Dec 31 , 2025 | 04:29 PM

కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ పార్టీ మధ్య తలెత్తిన విభేదాలు తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాల నుంచి కవిత సస్పెండ్, రాజీనామ వరకు అంతా కూడా రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

Year Ender 2025

2025 సంవత్సరంలో తెలంగాణ రాజకీయాల్లో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ పార్టీ మధ్య తలెత్తిన విభేదాలు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాల నుంచి కవిత సస్పెండ్, రాజీనామ వరకు అంతా కూడా రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఈ ఏడాది కవిత రాజకీయ ప్రయాణం ఏలా సాగిందనే దానిపై తెలుసుకుందాం...

ఇలా మొదలైన వివాదం

బీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యంగా కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీశాయి. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లను ఉద్దేశంచి ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్నిరేపాయి. పార్టీ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలు, నేతల పని తీరుపై బహిరంగంగానే కవిత పలు ప్రశ్నలు సంధించింది. దీంతో వివాదం మరింత ముదిరింది.

సస్సెన్షన్.. రాజీనామా

కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో బీఆర్‌ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. వెంటనే కవితపై చర్యలు తీసుకుంది. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ నిర్ణయంపై కవిత తనదైన తీరులో సమాధానం ఇచ్చారు. కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాకు అధికారికంగా ఆమోదం లభించలేదు. ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

జనం బాట పేరుతో..

పార్టీ నుంచి బయటకు వచ్చిత తర్వాత కవిత మరింత దూకుడు పెంచారు. ప్రజల్లో తిరగాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు. అందుకే ‘జనం బాట’ పేరుతో పర్యటన ప్రారంభించి పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రైతులు, మహిళలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కవితపై బీఆర్‌ఎస్ పార్టీ నేతల విమర్శలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై కవిత స్పష్టమైన ప్రకటన చేయలేదు. మొత్తానికి 2025 సంవత్సరంలో బీఆర్‌ఎస్‌కు కవిత పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కవిత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Updated Date - Dec 31 , 2025 | 04:44 PM