ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cold Waves In Telugu States: చలితో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి

ABN, Publish Date - Dec 29 , 2025 | 08:58 AM

తీవ్రమైన చలి గాలులతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్/ అమరావతి, డిసెంబర్ 29: తీవ్రమైన చలి గాలులతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. కొన్ని రోజులుగా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దాదాపుగా పడిపోయాయి. ఇక తెలంగాణలో సోమ, మంగళవారాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కోమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇక హైదరాబాద్, నాగర్ కర్నూల్, జగిత్యాల, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగామా, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందని వివరించింది. గత 24 గంటల్లో కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో అత్యంత కనిష్ట ఉష్ణోగత్రలు 7.1 డిగ్రీలు నమోదైందని తెలిపింది. సాధారణం కంటే రెండు లేదా మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రంగా ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి గట్టిగా ఉంటుంది. దీంతో ప్రజలకు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పగటి పూట ఎండ తీవ్రంగా ఉంటున్నా.. రాత్రి సమయంలో మాత్రం చలి చంపేస్తోంది. అరకు, పాడేరు, చింతపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లోని చలి విజృంభిస్తోంది. దాంతో సాధారణ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. పొగ మంచు సైతం ఈ ప్రాంతాలను కప్పేస్తోంది.

ఇక రహదారులన్నీ మంచుతో కప్పేశాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ చలి తీవ్రత మరికొద్ది రోజులు పాటు ఇలాగే ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

చలి గాలులు.. జాగ్రత్తలు తప్పని సరి: ఆరోగ్య నిపుణులు

తీవ్రమైన చలి గాలులు వీస్తు్న్న తరుణంలో పలు జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చలి ప్రభావంతో జలుబు, దగ్గుతోపాటు రక్తపోటు పెరడడం, కీళ్ల నొప్పులు, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలతోపాటు వృద్ధులు, గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకపోవడం మంచిదని పేర్కొంటున్నారు.

చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మఫ్లర్లు, సాక్సులు తప్పని సరిగా వేసుకోవాలంటున్నారు. ఆహారాన్ని వేడిగా తీసుకోవాలని చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంతగా గోరు వెచ్చని నీటిని తాగాలని సూచిస్తున్నారు. అలాగే వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి వేడి వేడి అల్లం టీ, కషాయం, సూప్‌లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయాలని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 08:59 AM