TG Politics: ఓవైపు ఎన్నికల జోరు.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్స్..
ABN, Publish Date - Dec 16 , 2025 | 08:31 PM
జిల్లాలోని మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కోసం ఏకంగా క్షుద్ర పూజలు చేశారన్న వార్త సంచలనంగా మారుమోగిపోతోంది. గ్రామంలో జరిగిన క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియోలు బయటికి..
నారాయణ పేట, డిసెంబర్ 16: జిల్లాలోని మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కోసం ఏకంగా క్షుద్ర పూజలు చేశారన్న వార్త సంచలనంగా మారుమోగిపోతోంది. గ్రామంలో జరిగిన క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియోలు బయటికి రాగా.. వెంకటమ్మ అభ్యర్థికి వ్యతిరేకంగా ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు సీసీ కెమరాలో రికార్డు అయ్యాయి. ఇక క్షుద్ర పూజలు నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు, వీధుల గుండా, సర్పంచ్ అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయారు. తెల్లవారుజామున అభ్యర్థి ఇంటిముందు, పంచాయతీ ఆఫీస్ ముందు అది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇది ఇలా ఉండగా ఇంటి ముందు క్షుద్ర పూజలు జరగడంతో సర్పంచ్ అభ్యర్థి వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ భయభ్రాంతులకు గురవడంతో కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
Updated Date - Dec 16 , 2025 | 08:31 PM