Hanumakonda: మహిళ అని చూడకుండా.. వివస్త్రను చేసి.. గుండు గీసి..
ABN, Publish Date - Jun 28 , 2025 | 11:44 AM
Hanumakonda Women Assault News: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణఘటన జరిగింది. మహిళపై నడివీధిలో విచక్షణారహితంగా దాడి చేసి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hanumakonda Women Assault News: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని తాటికాయలలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓమహిళపై విచక్షణారహితంగా దాడిచేశారు కొందరు. ఇనుప గ్రిల్స్‌కు కట్టేసి వివస్త్రను చేసి అవమానించడంతో పాటు ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధ చేశారు. అనంతరం చిక్కుడు రాజుకు, బాధితురాలికి గుండు గీయించారు. రాజు భార్య గంగా, ఆమె తరపు బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. పలుమార్లు పంచాయితీలు పెట్టి హెచ్చరించినా ఇరువురి తీరూ మారకపోవడంతో ఇలా చేశామని అంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jun 28 , 2025 | 11:50 AM