Gadwal Eruvada Jodi Panchalu: 400 ఏళ్లనాటి చరిత్ర.. తిరుమల శ్రీవారికి 'ఎరువాడ జోడు పంచెలు'
ABN, Publish Date - Sep 02 , 2025 | 11:58 AM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు కానుకగా అందాయి.
తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు కానుకగా అందాయి. 11 గజాల పొడవు, 85 ఇంచుల వెడల్పుతో తయారు చేసిన పంచెలను ఐదుగురు నేతన్నలు 48 రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో నేశారు. తిరుమల శ్రీవారికి ఆ జోడు పంచెలను ఇవ్వడం వెనుక 400 ఏళ్ల చరిత్ర ఉంది. గద్వాల సంస్థానం నల్ల సోమనాథ్ భూపాల్ కాలం నుంచి నేటి వరకు కూడా ఈ పంచెలను స్వామివారికి అందిస్తూ వస్తున్నారు.
Updated Date - Sep 02 , 2025 | 12:02 PM