ORS Label Ban: ORS లేబుల్ నిషేధం.. ఫలించిన డాక్టర్ 8 ఏళ్ల పోరాటం
ABN, Publish Date - Oct 18 , 2025 | 11:43 AM
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ పదం వినియోగంపై హైదరాబాద్ డాక్టర్ శివరంజనీ పోరాటం ఫలించింది. ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ వద్దంటూ..
హైదరాబాద్: ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ పదం వినియోగంపై హైదరాబాద్ డాక్టర్ శివరంజనీ 8 ఏళ్ల పోరాటం ఫలించింది. ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ వద్దంటూ కంపెనీలకు FSSAI ఆదేశించింది. ఆహార ఉత్పత్తుల ప్యాకేజీల మీదగానీ, వాటికి సంబంధించిన ప్రకటనల్లోగానీ ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడొద్దంటూ FSSAI నిబంధనల్లో మార్పులు చేసింది.
అయితే, ORS ట్రేడ్ మార్క్ నిషేధంపై జేఎన్‌టీఎల్ కన్‌స్యూమర్ హెల్త్(ఇండియా) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వీరి పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. FSSAI జారీ చేసిన ఆర్డర్ విషయంల JNTL కన్స్యూమర్ హెల్త్‌కు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్‌కు సంబంధించినంత వరకు అక్టోబర్ 14, 15, 2025 తేదీల నాటి ఉత్తర్వులను FSSAI అమలు చేయవద్దని జస్టిస్ సచిన్ దత్తా ఆదేశించారు.
Also Read:
శనిదేవుడిని పూజించేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి
కార్తీక మాసంలో దీపాలను ఎందుకు దానం చేయాలి? దాని ప్రాముఖ్యత తెలుసుకోండి
For More Latest News
Updated Date - Oct 18 , 2025 | 10:01 PM