కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ పొగడ్తలు..
ABN, Publish Date - May 01 , 2025 | 01:14 PM
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కులగణన నిర్ణయం విషయంలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కులగణన నిర్ణయం విషయంలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కాలగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని.. రాహుల్ పాదయాత్రలో కుల గణనపై చర్చ చేసారని గుర్తు చేశారు. కుల గణన చేయాల్సిందేనని రాహుల్ తేల్చి చెప్పారన్నారు. కేంద్రం నిర్ణయంపై రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదన్న సీఎం.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. కుల గణనపై తెలంగాణ రాష్ట్రానికి అవగాహన ఉందన్నారు. కుల గణన కోసం దేశ వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందన్నారు. కుల గణన కోసం మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అధికారులతో, నిపుణులతో ఒక కమిటీ వేసి అధ్యయనం చేయాలన్నారు.
Updated Date - May 01 , 2025 | 01:14 PM