ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘోరం.. కాకినాడలో పార్శిల్ బ్లాస్ట్

ABN, First Publish Date - 2025-03-03T15:45:32+05:30

parcel explosion: కాకినాడలో ఈరోజు (సోమవారం) జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్‌ను దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

తూర్పుగోదావరి, మార్చి 3: కాకినాడ వార్పురోడ్డులోని ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అవడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్‌‌ను (parcel explosion) దించుతుండగా ఈ ఘటన జరిగింది. ఈరోజు (సోమవారం) ఉదయం బాలాజీ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో నుంచి పార్శిల్స్‌ను దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఐదుగురు కూలీలు గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


పార్శిల్‌ను దించుతున్న కూలీ చేతులు, కాళ్లు కాలిపోయాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్న పిల్లలు గోడకేసి కొట్టగా పేలే టపాసులు ఉన్న పార్శిల్ పేలినట్లు నిర్ధారణకు వచ్చారు. పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఏ ట్రాన్స్‌పోర్టు కంపెనీ పంపింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-03-03T15:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising