Share News

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి

ABN , Publish Date - Mar 03 , 2025 | 11:24 AM

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో సంచరించిన అరుదైన జంతువును చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి
Toddy Cat spotted Krishna District

కృష్ణా, మార్చి 3: అరుదైన జాతి పునుగుపిల్లి (Toddy Cat) మరోసారి జనావాసాల్లోకి వచ్చేసింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగుపిల్లిని స్థానికులు గుర్తించారు. రాత్రి సమయంలో పునుగుపల్లి సంచరించడాన్ని చూసిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పునుగుపిల్లిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వలవేసి మరీ పునుగుపల్లిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.


అలాగే నిన్న (ఆదివారం) గుంటూరు జిల్లాలోనూ ఈ అరుదైన జాతి పునుగుపిల్లి సంచరించింది. ఓ ఇంట్లో వెళ్లి దాక్కున్న పునుగుపిల్లిని చూసి మొదట మామూలు పిల్లి అని అంతా భావించారు. కానీ అది వింతగా కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ప్రజలను చూసి ఆ పునుగుపల్లి (టోడీక్యాట్‌) భయాందోళనకు గురై ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కుంది. అది పారిపోకుండా స్థానికులు కాపలా కాశారు. చివరకు ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని పునుగుపిల్లిన పట్టుకున్నారు. జనావాసాల్లోని పునుగుపిల్లి రావడంపై అవీశాఖ అధికారులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పునుగుపిల్లి ఒక్కటే ఉండదని మరికొన్ని ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో మిగితా వాటి కోసం ఫారెస్ట్ అధికారులు గాలించారు.

Zelensky: వైట్‌హౌస్ రచ్చ.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు


పునుగుపిల్లి ప్రత్యేకత...

కాగా.. ఎంతో అరుదుగా కనిపించే ఈ పునుగుపిల్లిలు ఎక్కువగా శేషాచలం అడవుల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వీటి నుంచి వచ్చే తైలంతో సాక్షాత్తు ఆ తిరుమలేశుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు అర్చకులు. తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు. శ్రీవారికి ఒక పూజలో ఈ తైలాన్ని ఉపయోగిస్తారు. తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు. ఈ క్రమంలో పునుగుపిల్లిల సంఖ్యను పెంచేందుకు కూడా టీటీడీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంది.


ఇవి కూడా చదవండి...

Blue Flag certification: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు!

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2025 | 11:24 AM