Maoist: ఆపరేషన్ కగార్‌తో కకావికలమైన మావోలు.. కొత్త దళపతిగా తిరుపతి..
ABN, Publish Date - Sep 10 , 2025 | 12:45 PM
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఎన్నికయ్యారు. ఆపరేషన్ కగార్‌తో కకావికలమైన మావోయిస్టు పార్టీ కాస్తా తేరుకుని కొత్త కమిటీని ప్రకటించింది. పియాజియో చీఫ్‌గా ఉన్న మాండవి హిడ్మా అలియాస్ సంతోష్‌ను దండకారణ్య స్పెషల్ కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్.. ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చింది. డజన్‌కు పైగా ఫ్రంట్‌లైన్ నేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అలాగే వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు కూడా చనిపోవడం ఆ పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం చూపించింది. మే 21న ఛత్తీస్‌గఢలోని బస్తర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో సంస్థ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బలవరాజ్ అలియాస్ గంగన్న సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Sep 10 , 2025 | 12:45 PM