శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ కలకలం
ABN, Publish Date - Jun 27 , 2025 | 10:23 AM
శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌తో కొందరు ఆకతాయిలు ఆటలాడుతున్నారు. తిరుమల వెంకన్న పాటలను ప్యారడీ చేయడమే కాకుండా.. శ్రీవారి ఆలయాన్ని చూపిస్తూ.. గేమింగ్ యాప్స్ సృష్టించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది
శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌తో కొందరు ఆకతాయిలు ఆటలాడుతున్నారు. తిరుమల వెంకన్న పాటలను ప్యారడీ చేయడమే కాకుండా.. శ్రీవారి ఆలయాన్ని చూపిస్తూ.. గేమింగ్ యాప్స్ సృష్టించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్‌లైన్‌లో గేమింగ్ యాప్ సృష్టించడం కలకలం రేగుతోంది.
టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ యాప్‌ను తమిళనాడుకు చెందిన ఒక సంస్థ డెవలప్ చేసింది. రోబ్లెక్స్ సంస్థ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఈ యాప్‌లో తిరుమల ఆలయ ప్రవేశం.. దర్శనంతోపాటు హుండీలో కానుకలు సమర్పించడం.. లడ్డూ ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ.. ఈ గేమ్‌ను డిజైన్ చేసింది.
ఈ వీడియోలను వీక్షించండి..
హై కోర్టుకు ఎక్కిన వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ వివాదం.!
గోల్కొండ లో మొదలైన ఆషాఢ బోనాల సందడి
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 27 , 2025 | 10:26 AM