తిరుమల ఏఎస్పీపై వేటు
ABN, First Publish Date - 2025-02-22T10:50:26+05:30
Tirumala: తిరుమల ఏఎస్పీ ప్రభాకర్ బాబుపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. అతడిపై వచ్చిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
తిరుమల, ఫిబ్రవరి 22: తిరుమల అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబుపై చర్యలకు ప్రభుత్వం (AP Govt) ఆదేశించింది. తిరుమల డీఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో ప్రభాకర్ బాబు అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పాటు పలువురుని ఇబ్బందులకు గురిచేసినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ప్రభాకర్ బాబుపై విచారణ జరిపిన అనంతరం శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. తిరుమల ఏఎస్పీపై ఉన్న అభియోగాలకు 15 రోజుల లోపల వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏఎస్పీ ప్రభాకర్ బాబు సెలవులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
AP Fiber Net: ఫైబర్ నెట్లో ఏం జరుగుతోంది!
చంద్రబాబుతో పంచాయితీ కేసీఆర్ వల్లే..
Read Latest AP News And Telugu News
Updated Date - 2025-02-22T10:50:39+05:30 IST