మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు LIVE అప్‌డేట్స్
ABN, Publish Date - Dec 17 , 2025 | 10:01 AM
మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అందువల్ల 3,752 గ్రామ పంచాయతీలకూ, 28,410 వార్డులకూ పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఇవి చదవండి
అతడితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా.. రవి బిష్ణోయ్
ఓటమి భయం.. ఆత్మహత్యకు యత్నించిన సర్పంచ్ అభ్యర్థి
Updated Date - Dec 17 , 2025 | 10:26 AM