Ravi Bishnoi: అతడితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా.. రవి బిష్ణోయ్
ABN , Publish Date - Dec 17 , 2025 | 10:18 AM
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అతడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జడేజాతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం అబుదాబీ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. బేస్ ప్రైజ్ రూ.2కోట్లు కాగా అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. చివరికి ఆర్ఆర్ వేలంలో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రవి బిష్ణోయ్(Ravi Bishnoi) తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
‘హోమ్ టీమ్‌లో ఆడే అవకాశం దక్కడం నిజంగా ఆనందంగా ఉంది. రవీంద్ర జడేజా(Ravindra Jadeja)తో కలిసి బౌలింగ్ చేయనుండటం ఎంతో బాగుంది. నా కెరీర్‌కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అతడు చాలాకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ ఫార్మాట్‌లో కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అతడు అత్యుత్తమ ఆల్‌రౌండర్. అందుకే అతడితో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అలాగే సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో మాకు మంచి పిచ్ కూడా ఉంది. అక్కడ ఉన్న పొడవైన బౌండరీలు ఈ ఐపీఎల్‌లో మాకు కచ్చితంగా సహాయపడతాయి’ అని రవి బిష్ణోయ్ అన్నాడు.
రవి బిష్ణోయ్ ఇప్పటి వరకు 77 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. ఇందులో 8.22 ఎకానమీ, 31.1 యావరేజ్‌తో 72 వికెట్లు తీశాడు. 42 అంతర్జాతీయ టీ20ల్లో 7.36 ఎకానమీ, 19.4 యావరేజ్‌తో 61 వికెట్లు తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్
ధోనికి ఇదే చివరి ఐపీఎల్.. రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు