సుప్రీంకు తమిళనాడు సర్కార్.. ఎందుకంటే
ABN, Publish Date - May 21 , 2025 | 12:54 PM
Tamilnadu Govt: టాస్మాక్‌పై ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మార్చి 6, 8 తేదీల్లో టాస్మాక్ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
చెన్నై, మే 21: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్‌పై ఈడీ దాడులకు (ED Raids) వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Govt) సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించింది. మద్యం విక్రయ సంస్థ అయిన టాస్మాక్‌లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఈడీ దాడులను సవాల్ చేస్తూ తమిళనాడు సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈడీ దర్యాప్తుపై స్టాలిన్ ప్రభుత్వం వేసిన పిటిషన్లకు కొట్టివేస్తూ ఏప్రిల్ 23న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టాలిన్ ప్రభుత్వం సవాల్ చేసింది.
ఈ ఏడాది (2025) మార్చి 6, 8 తేదీల్లో టాస్మాక్ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడులపై తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. అయితే ఏప్రిల్ 23న హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. మనీలాండరింగ్ అనేది దేశ ప్రజలపై చేసే నేరంగా మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఇప్పుడు తాజాగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈడీ దాడులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
ఇవి కూడా చదవండి
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు
Read Latest National News And Telugu News
Updated Date - May 21 , 2025 | 12:54 PM