చలి పులి పంజా.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ABN, Publish Date - Dec 26 , 2025 | 10:17 AM
తెలంగాణను చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు. వీటికి తోడు చల్లటి గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు. వీటికి తోడు చల్లటి గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధరలో 6.9 డిగ్రీల అత్యుల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్ లో 7, కేరమరిలో 8.7 డిగ్రీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర ప్రజలు కూడా చలి దెబ్బకు గజగజ వణుకుతున్నార. ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన రైల్వే చార్జీలు.. నేటి నుంచి అమలు
కడుపులో అల్సర్లు తగ్గించే జ్యూస్..
Updated Date - Dec 26 , 2025 | 10:23 AM