కడుపులో అల్సర్లు తగ్గించే జ్యూస్..

క్యాబేజీని ఆహారంగా తీసుకోవడంలోనే కాదు.. జ్యూస్‌గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఈ జ్యూస్ కడుపులోని అల్సర్లను త్వరగా నయం చేస్తుంది. కడుపులోని లైనింగ్‌ను రక్షిస్తుంది. యాసిడ్ పిఫ్లెక్స్ తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.  

దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తుంది. 

క్యాబేజీలోని యాంటీ ఇన్ల్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలకు కారణమవుతుంది.

ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

తక్కవ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

వీటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది.

శరీరంలో ఈస్ట్రోజెన్ వినియోగాన్ని మార్చడం ద్వారా హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

వీటిలో ఫోలేట్, గ్లూటామిన్, సల్ఫరఫేన్ వంటి సమ్మేళనాలతోపాటు ఎస్ మిథైల్‌మెథియోనిన్ (విటమిన్ యూ ) ఉంటుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు హైబీపీని సైతం తగ్గించడంలో సహాయపడుతుంది.