ముల్లంగి రసం తాగితే.. ఇన్ని లాభాలా..?

ముల్లంగిలో ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముల్లంగి రసం తాగడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. రక్తంలోని వ్యర్థ్యాలు తొలగిపోతాయి. ఎముకలు ధృడంగా ఉంటాయి.

రాత్రి భోజనంలో తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. 

దీనిలో విటమిన్ సి, పొటాషియం, ఫోలెట్ తదితర పోషకాలుంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రిస్తుంది. ఫోలేట్ కణాల అభివృద్ధికి దోహదపడుతుంది. 

పొట్ట ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

ప్రతి రోజు కాకుండా.. వారానికి ఒకటి రెండు సార్లు ఈ రసం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

ఈ రసం తాగితే మెటబాలిజం మెరుగుపడుతుంది. శరీరంలో రక్తం సరఫరా బావుంటుంది. గుండె, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి.

ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. 

థైరాయిడ్ సమస్య ఉన్న వారు, గర్బిణీలు.. వైద్యుని సలహా, సూచన మేరకు ఈ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.