నియోజకవర్గంలోని నేతలకు ఎమ్మెల్యే యార్లగడ్డ భరోసా
ABN, Publish Date - Nov 09 , 2025 | 09:26 PM
గన్నవరం నియోజకవర్గానికి నామినేటెడ్ పదవుల పంపకంలో తీరని అన్యాయం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ప్రభుత్వం నియమించే కమిటీల్లో ఈ నియోజకవర్గానికి అధికంగా పదవులు వచ్చేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని పార్టీ నేతలకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
గన్నవరం నియోజకవర్గానికి నామినేటెడ్ పదవుల పంపకంలో తీరని అన్యాయం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ప్రభుత్వం నియమించే కమిటీల్లో ఈ నియోజకవర్గానికి అధికంగా పదవులు వచ్చేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని పార్టీ నేతలకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. స్థానిక పార్టీ శ్రేణులు.. ఎన్నో అరాచకాలు ఎదురొడ్డి నిలిచి కష్టపడి పని చేశారని గుర్తు చేసుకున్నారు.
అటువంటి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి అందరూ కలిసి సమిష్టిగా పని చేయాలంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. ఆలయానికి ఉన్న రూ.28 లక్షల నిధులుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి నిధులు చాలకుంటే దాతల సహకారం తీసుకొవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను సైతం తాను మంజూరు చేయిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఓటర్ల చేతిలో అభ్యర్థుల భవిష్యత్తు
అరుణాచలం గిరి ప్రదక్షిణకు భక్తులు ఎక్కువగా రావడానికి కారణమేమిటి..?
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 09 , 2025 | 09:30 PM