ప్రతిపక్ష హోదా అడిగితే జగన్ చెంప పగలగొట్టాలి..!
ABN, Publish Date - Sep 18 , 2025 | 11:52 AM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైఎస్ జగన్ చంప పగలగొట్టాలన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైఎస్ జగన్ చంప పగలగొట్టాలన్నారు. ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీకి వచ్చి కూర్చోవడం ఎంత తప్పో.. జగన్ ప్రతిపక్ష హోదా అడగడం కూడా అంతే తప్పన్నారు. ప్రతిపక్ష హోదా అడగడం మానేసి.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆయన హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై చర్చించి.. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా వైఎస్ జగన్ పనికి రాడని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
ఎంటిఫా సంస్థ ఉగ్రవాద సంస్థ.. ట్రంప్ సంచలన ప్రకటన
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 18 , 2025 | 11:52 AM