ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేను ఒప్పుకోను.. చిరు సీరియస్

ABN, Publish Date - Mar 21 , 2025 | 03:27 PM

Chiranjeevi warns: ఫ్యాన్స్ మీట్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడంపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తాను అస్సలు ఒప్పుకోనని మెగాస్టార్ స్ఫష్టం చేశారు.

హైదరాబాద్, మార్చి 21: టాలీవుడ్ అగ్ర కథనాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు సంపాదించుకోవాలని అనుకోవడంపై మెగాస్టార్ స్పందించారు. నిన్న(గురువారం) యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ మీట్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం చిరు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో దీనిపై స్పందించిన చిరంజీవి.. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం తన దృష్టికి వచ్చిందన్నారు.


ఇలాంటి అనుచిత ప్రవర్తనను తాను అస్సలు ఒప్పుకోనన్నారు. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండని తెలిపారు. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని చిరంజీవి అన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 03:27 PM