ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లాలాగూడ జంట హత్యల కేసులో విస్తుపోయే వాస్తవాలు

ABN, First Publish Date - 2025-03-10T15:59:04+05:30

Lalaguda Double Murder: లాలాగూడ జంట హత్యల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అదుపులో ఉన్న అరవింద్ హత్యకు సంబంధించిన అసలు విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, మార్చి 10: నగరంలోని లాలాగూడ జంట హత్యల కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తల్లీ, కూతుళ్లను హత్య చేసిన అరవింద్ కుమార్ అలియాస్‌ అరుణ్‌ను సికింద్రాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. లాలాగూడకు చెందిన తల్లి సుశీల, అక్క జ్ఞానేశ్వరి వల్ల తమ వివాహేతర సంబంధం బయటపడుతుందని లక్ష్మీ, అరవింద్ కుమార్ కలిసి వారిద్దరిని హత్య చేశారు. సుశీల, జ్ఞానేశ్వరిని హత్య చేసి ఎలా తప్పించుకోవాలో వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసి తప్పించుకున్నట్లు నిందితుడు అరవింద్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. సుశీల భర్త మరణాంతరం రెండో కూతురు లక్ష్మీకి కారుణ్య నియామకం కింద రైల్వేలో సహాయకురాలి ఉద్యోగం వచ్చింది. సుశీల కుటుంబం లాలాగూడలోని రైల్వే క్వాటర్స్‌లో ఉన్నప్పుడు యూపీకి చెందిన మేస్త్రీ అరవింద్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది.


ఈ క్రమంలో అరవింద్, లక్ష్మీ మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. కానీ అప్పటికే అరవింద్ కుమార్‌కు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి సుశీల, మూడో కూతురు ఉమామహేశ్వరి జవహర్‌నగర్‌లోని ఇంట్లో ఉంటున్నారు. రైల్వే క్వాటర్స్‌లో జ్ఞానేశ్వరి, లక్ష్మీ మాత్రమే ఉండేవారు. ఇంట్లో జ్ఞానేశ్వరి ఉండగానే అరవింద్ కుమార్ తరచూ లక్ష్మీ కోసం వచ్చేవాడు. ఈ విషయంలో లక్ష్మీ, జ్ఞానేశ్వరి మధ్య గొడవులు జరిగాయి. పెళ్లి చేసుకుంటానని లక్ష్మీ చెప్పగా అక్క జ్ఞానేశ్వరి వద్దని వారించేది. సుశీల, జ్ఞానేశ్వరిలకు తమ విషయం తెలిసిందని, వారిని అడ్డు తొలగించుకోవాలని అరవింద్ పథకం వేశాడు. వారిద్దరినీ హత్య చేసి తప్పించుకునేందుకు అరవింద్ వెబ్‌సిరీస్‌లు, యూట్యూబుల్లో క్రైమ్ సిరీస్ చూశాడు. తమ పథకం ప్రకారం మార్చి 1 లక్ష్మీ, అరవింద్ కలిసి జ్ఞానేశ్వరిని హత్య చేశారు. మార్చి 3న బస్తాలో మూటగట్టి సమీపంలో ఖాళీగా ఉన్న రైల్వే క్వాటర్‌లోని సంపులో విసిరేశారు. ఆ తరువాత సుశీలను జవహర్‌నగర్ పరిధిలో కౌకూర్‌లోని నివాసంలోనే హత్య చేశారు. దోపిడీ దొంగలు చూసినట్లుగా చిత్రీకరించేందుకు అరవింద్ బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. లక్ష్మీతో అరవింద్ తరచూ ఫోన్ మాట్లాడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. లక్ష్మీని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జంట హత్యల కేసు బయటపడింది.


ఇవి కూడా చదవండి..

Most Wanted Cheater Arrest: మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ అరెస్ట్.. మోసాల చిట్టా మామూలుగా లేదుగా

CM Revanth Criticizes KCR: 39 సార్లు కాదు 99 సార్లు ఢిల్లీ పోతా.. మేకేంది బాధ

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-03-10T15:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising