Most Wanted Cheater Arrest: మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ అరెస్ట్.. మోసాల చిట్టా మామూలుగా లేదుగా
ABN , Publish Date - Mar 10 , 2025 | 11:45 AM
Most Wanted Cheater Arrest: ఇంటరీయర్ డిజైనర్ పేరులతో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెంట్ చీటర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది.

హైదరాబాద్, మార్చి 10: కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్సే అతని టార్గెట్. ఇంటీరియర్ డిజైనర్ అంటూ పరిచయమై అందరినీ తన మాటలతో మాయ చేస్తాడు.ఫేక్ వీడియోస్ చూపిస్తూ నమ్మబలుకుతాడు. ఇక డబ్బులు చేతుల్లో బడ్డాయో.. ఇంక అంతే. కంటికి కనిపించకుండా మాయమైపోతాడు. ఫోన్లలో అందుబాటులో ఉండడు. చివరకు మోసం పోవడం యజమానుల వంతవుతుంది. ఇతడి మాయ మాటలు నమ్మి మోసపోయినవారు ఎందరో. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతడి అదృష్టం బాగున్నన్ని రోజులు బాగానే మోసం చేస్తూ పబ్బం గడిపాడు. మోసం చేసిన డబ్బులతో జెల్సాలు చేశాడు. ఎట్టకేలకు అతడి పాపం పండి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఎలాంటి మోసాలకు పాల్పడ్డాడు.. ఏమిటా కథా ఇప్పుడు చూద్దాం.
పశ్చిమబెంగాల్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ చీటర్ పలాష్ పాల్‌ను నారాయణ గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్ టార్గెట్‌గా పలాశ్ మోసాలకు పాల్పడ్డాడు. ఇంటీరియర్ డిజైనర్‌నంటూ సైట్స్ ఎండ్ కన్స్ట్రక్షన్ ఓనర్స్‌కు తనకు తాను పరిచయం చేసుకుని పరిచయం చేసుకుంటాడు. ఇంటీరియర్ డిజైన్స్ సంబంధించి ఫెక్ వీడియోస్ చూపించి వర్క్ చేస్తానంటూ అందినకాడికి డబ్బులు వసూలు చేశారు. తీరా డబ్బులు చేతిలో పడ్డాక ఓనర్స్ కాల్స్‌కు స్పందించడు. అంతేకాకుండా నిందితుడు పలాశ్ పాల్‌పై ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసుకు కూడా నమోదు అయ్యింది. మర్డర్ కేసు సంబంధించి కోర్ట్ పేషీలకు పలాశ్ హాజరుకాలేదు. దీంతో పలాశ్ పాల్‌పై ఎన్‌బీడబ్ల్యూ వారెంట్‌ను న్యాయస్థానం జారీ చేశారు.
BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు
పలాశ్ పాల్‌పై ఎస్ఆర్‌నగర్, నారాయణగూడా, శంషాబాద్, రాయదుర్గ్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. నారాయణగూడలో నికిత్ రెడ్డి వద్ద కార్పెంటర్, వుడ్ వర్క్స్ కోసం అంటూ దాదాపు రూ.66 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్నాక వాట్సాప్, నార్మల్ కాల్ అందుబాటులో లేకపోవడంతో నిఖిత్ రెడ్డి అప్రమత్తమయ్యాడు. పలాశ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని అకౌంట్‌లో ఉన్న రూ. 18,65,000 బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. పలాశ్ పాల్ కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు.. చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పలాశ్ వద్ద నుంచి 120 గ్రాముల బంగారం, 40 వేల రూపాయల కాష్, పలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్, మొబైల్ ఫోన్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Borugadda Anil Case.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు
Twists in TG Politics: తెలంగాణలో మారుతున్న రాజకీయం.. కలిసొచ్చేదెవరికి
Read Latest AP News And Telugu News