BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు
ABN , Publish Date - Mar 10 , 2025 | 10:30 AM
Somuveerraju: ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన విషయం తెలిసిందే.

అమరావతి, మార్చి 10: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా సోమువీర్రాజు (Somuveerraju) పేరు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ తరపున సోము వీర్రాజు పేరును అధిష్టానం ఖరారు చేసింది. గతంలో కూడా సోమువీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. పొత్తులో భాగంగా ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఈరోజు (సోమవారం) రాష్ట్ర శాసనసభలో నామినేషన్లు ఉండటంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు పేరును ఖరారు చేసినట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు ఢిల్లీ నుంచి సమాచారం అందించారు. మరికొద్దిసేపట్లోనే సోమువీర్రాజు నామినేషన్ వేయనున్నారు.
గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో సోమువీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆయన తరువాత దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చివరి నిమిషం వరకు బీజేపీ సీనియర్ నేత పాకాల సత్యనారాయణ, సోమువీర్రాజు విషయంలో పార్టీ హైకమాండ్ కాస్త తర్జనభర్జనకు గురైనప్పటికీ చివరకు సోమువీర్రాజు పేరునే ఖరారు చేసింది అధిష్టానం. కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసెంబ్లీలోని కమిటీ హాల్ నెంబర్ 2లో నామినేషన్ వేయనున్నారు సోమువీర్రాజు. దీనికి సంబంధించి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Borugadda Anil Case.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు
Twists in TG Politics: తెలంగాణలో మారుతున్న రాజకీయం.. కలిసొచ్చేదెవరికి
Read Latest AP News And Telugu News