Home » MLC Candidate
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు సభ్యులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్; సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం; బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.
CM Revanth on MLC Seats: అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అలాగే గాంధీ కుటుంబంతో అనుబంధం అంతకు మించి అని.. దాన్ని ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు.
ఎమ్మెల్యే కోటా పరిధిలోని ఐదు ఎమ్మెల్సీ సీట్లకు కాంగ్రెస్ తరఫున ముగ్గురు, సీపీఐ, బీఆర్ఎస్ తరపున ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఐదు సీట్లకుగాను నాలుగింటిలో పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్.. అందులో ఒకటి మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన సంగతి తెలిసిందే.
MLC nomination process: రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ పర్వం ముగిసింది. తెలంగాణలో ఐదుగురు అభ్యర్థులు, ఏపీలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
KTR Comments: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ, కాంగ్రెస్ ఎదగనివ్వదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
Somuveerraju: ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ పేరును మాజీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేయున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు రేసులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల జాబితా చాలా పెద్దగానే ఉంది. 4 స్థానాలకు ఏకంగా సుమారు 25 మందికి పైగా రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీడీపీలో భారీ కసరత్తే నడుస్తోంది.
Nagababu: జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు నాగబాబు.
Telangana MLA Quota MLC Elections: సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఫిక్స్ అయ్యిందా.. ఢిల్లీ నుంచి అధిష్టానం ఏం సిగ్నల్స్ పంపింది.. సామకు ఎమ్మెల్సీ ఇస్తే యువతకు ప్రోత్సాహం లభిస్తుందా.. కాంగ్రెస్‌లో యువ నాయకులు ఏం కోరుకుంటున్నారు.. ప్రత్యేక కథనం మీకోసం..