Kalthi Kallu: ప్రమాదకర కెమికల్స్‌తో కృత్రిమ కల్లు
ABN, Publish Date - Jul 10 , 2025 | 08:32 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ కల్తీ కల్లు కలకలం రేపుతోంది. తాటిచెట్లు లేకున్నా ప్రతి గ్రామంలో కల్లు దుకాణం వెలిసింది. వివిధ రకాల ప్రమాదకర కెమికల్స్‌ను ఉపయోగించి కల్తీ కల్లును తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీటిలో..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ కల్తీ కల్లు కలకలం రేపుతోంది. తాటిచెట్లు లేకున్నా ప్రతి గ్రామంలో కల్లు దుకాణం వెలిసింది. వివిధ రకాల ప్రమాదకర కెమికల్స్‌ను ఉపయోగించి కల్తీ కల్లును తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీటిలో కలిపే కెమికల్స్ మోతాదు పెరిగిన సమయంలో అది ప్రాణాంతమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలా మంది కొన్నేళ్లుగా ఈ కల్తీ కల్లుకు బానిసలవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు దుకాణాలపై పోలీసుల తనిఖీలు తూతూమంత్రంగా ఉంటున్నాయని, ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jul 10 , 2025 | 08:42 PM